IPL 2025 RCB vs CSK: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడుతున్న వెస్టిండీస్ ఆటగాడు రోమారియో షెపర్డ్ దుమ్మురేపే ఇన్నింగ్స్ ను ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలను దంచికొడుతూ ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి రికార్డుల మోత మోగించాడు.
IPL 2025 RCB vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో దుమ్మురేపే ఇన్నింగ్స్ ను చూపించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మరీ ముఖ్యంగా ఆర్సీబీ ప్లేయర్ రోమారియో షెపర్డ్ పరుగుల సునామీ సృష్టించాడు. వరుసగా సిక్సర్ల మోత మోగిస్తూ రికార్డు హాఫ్ సెంచరీ కొట్టాడు.
ఆర్సీబీ తరఫున ఆడుతున్న వెస్టిండీస్ ఆటగాడు రోమారియో షెపర్డ్ ఐపీఎల్ అభిమానులను తన బ్యాట్ పవర్ తో ఉర్రూతలూగించాడు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. క్రికెట్ లవర్స్ ను పరుగుల వర్షంలో ముంచెత్తాడు. ఎప్పటికీ మర్చిపోలేని ఇన్నింగ్స్ ను ఆడాడు.
ఐపీఎల్ 2025 52వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి మంచి ఆరంభం లభించింది. జాకబ్ బెథెల్ 55 పరుగులు, విరాట్ కోహ్లీ 62 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు రాణించలేకపోయారు.
కానీ, చివరి ఓవర్లలో బ్యాటింగ్ కు వచ్చిన రోమారియో షెపర్డ్ పరుగుల సునామీ సృష్టించాడు. తన బ్యాట్ పవర్ ఏంటో చూపిస్తూ సిక్సర్ల మోత మోగించాడు. చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ వేసిన 19వ ఓవర్ లో ఏకంగా 33 పరుగులు రాబట్టాడు. వరుసగా 6 బంతుల్లో 6, 6, 4, 6నోబాల్, 0, 4 కొట్టాడు. దీంతో ఐపీఎల్ 2025లో ఒక ఓవర్ లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా రికార్డు సాధించాడు.
ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన రోమారియో షెపర్డ్
తన సునామీ నాక్ తో రోమారియో షెపర్డ్ ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. తన 53 పరుగుల ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. అతని సూపర్ నాక్ తో చివరి రెండు ఓవర్లలో ఆర్సీబీ 54 పరుగులు సాధించింది. వాటిలో షెపర్డ్ ఒక్కడే 52 పరుగులు కొట్టాడు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 213/5 పరుగులు చేసి చెన్నై టీమ్ ముందు భారీ టార్గెట్ ను ఉంచింది.
ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. ఇప్పుడు రొమారియో షెపర్డ్ రెండో స్థానంలోకి దూసుకొచ్చాడు.

