MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • 20 నిమిషాల్లో తయారు చేసే సింపుల్ బ్రేక్‌ఫాస్ట్‌ ఐటమ్స్

20 నిమిషాల్లో తయారు చేసే సింపుల్ బ్రేక్‌ఫాస్ట్‌ ఐటమ్స్

క్వినోవా అంటే ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే ఒకరకమైన ధాన్యం. ఇది గోధుమలు, బియ్యానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఈ ధాన్యంతో సులభంగా, త్వరగా తయారు చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్కూళ్లకు వెళ్లే పిల్లలకు, ఆఫీసులకు వెళ్లే పెద్దలకు ఇది చాలా ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 03 2025, 10:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

క్వినోవా యోగర్ట్ బౌల్

ఉడికించిన క్వినోవాకు బెర్రీస్, అరటిపండు, మామిడిపండు వంటి పండ్లు, పెరుగు కలపండి. ఈ మిశ్రమానికి ఒక టీస్పూన్ తేనె కలిపితే రుచికరమైన, పోషకాలు నిండిన బ్రేక్ ఫాస్ట్ రెడీ అయిపోతుంది. పెరుగు అదనపు ప్రోటీన్‌ను అందిస్తుంది. అవిసె గింజలు లేదా చియా గింజలు వంటివి ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను పెంచుతాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

క్వినోవా ఓట్స్

రెగ్యులర్ ఓట్స్‌కు బదులుగా క్వినోవాను ఉడికించి దానికి వేడి పాలు లేదా నీరు, పండ్లు, నట్స్‌తో కలిపి తింటే ఆరోగ్యంతో పాటు శరీరానికి ఇన్‌స్టంట్ శక్తి వస్తుంది. దాల్చిన చెక్క లేదా యాలకులు వంటి మసాలా దినుసులు వేసుకుంటే రుచి పెరుగుతుంది. తీపి కోసం తేనె లేదా మాపుల్ సిరప్ వేసుకోవచ్చు.

క్వినోవా, బెర్రీ బౌల్

ఉడికించిన తర్వాత చల్లగా తయారైన క్వినోవాతో స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ, బ్లూబెర్రీ వంటి బెర్రీ పండ్లు, తేనె లేదా అగేవ్ సిరప్‌తో కలిపి తింటే సింపుల్ గా కడుపు నిండుతుంది. బెర్రీ పండ్లు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. దీంట్లో కొన్ని పుదీనా ఆకులు వేసుకుంటే రిఫ్రెష్ అయిన ఫీల్ వస్తుంది. బాదం ముక్కలు లేదా చియా గింజలు వేసుకుంటే క్రంచీగా ఉంటాయి.

Related Articles

Related image1
అవకాడో వంటకాలు: బ్రేక్ ఫాస్ట్ నుండి డెజర్ట్ వరకు..
Related image2
బంగాళాదుంప తొక్కతో కూడా మొటిమలు తగ్గించుకోవచ్చు. ఎలాగంటే..
35

క్వినోవా స్మూతీ

ఉడికించిన క్వినోవాతో అరటిపండు, బెర్రీస్, మామిడిపండు, పాలు లేదా పెరుగు, కొద్దిగా తేనె లేదా మాపుల్ సిరప్ కలిపి మెత్తగా బ్లెండ్ చేయండి. ఆకుకూరలు కలిపితే అదనపు పోషకాలు యాడ్ అవుతాయి. పోషకాలతో కూడిన ఈ స్మూతీ మీరు ఇన్ స్టంట్ శక్తినిస్తుంది. 

క్వినోవా, వెజిటబుల్ సలాడ్

చల్లటి ఉడికించిన క్వినోవాతో తరిగిన దోసకాయ, టమాటా, క్యాప్సికమ్, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం లేదా ఆలివ్ ఆయిల్ కలిపి తినవచ్చు. ఇది తేలికైన, శరీరాన్ని రిఫ్రెష్ చేసే ఫుడ్ అవుతుంది. ఉడికించిన చిక్కుళ్ళు లేదా బ్లాక్ బీన్స్ కలిపితే అదనపు ప్రోటీన్, ఫైబర్ లభిస్తుంది.

45

క్వినోవా, ఆపిల్ దాల్చిన చెక్క

ఆపిల్, దాల్చిన చెక్క ఒక క్లాసిక్ కాంబినేషన్. అందుకే ఉడికించిన క్వినోవాతో తరిగిన ఆపిల్ ముక్కలు, దాల్చిన చెక్క, కొద్దిగా తేనె లేదా మాపుల్ సిరప్‌తో కలిపి వేడిగా లేదా చల్లగా తినొచ్చు. వేయించిన బాదం లేదా వాల్‌నట్స్ వేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. కొద్దిగా నిమ్మరసం కలిపితే ఆపిల్ గోధుమ రంగులోకి మారకుండా ఉంటుంది.

క్వినోవా, కొబ్బరిపాలు మిక్స్

ఉడికించిన క్వినోవాతో కొబ్బరిపాలు, కొద్దిగా తేనె లేదా బెల్లం, యాలకుల పొడి కలిపి తేలికగా వేడి చేసి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లా తినొచ్చు. జీడిపప్పు, పిస్తా వంటి నట్స్ కలిపితే క్రంచీగా ఉంటుంది.

55

క్వినోవా, డ్రై ఫ్రూట్స్ మిక్స్

చల్లటి ఉడికించిన క్వినోవాతో ఎండుద్రాక్ష, ఖర్జూరం, ఎండిన ఆప్రికాట్ వంటి ఎండు పండ్లు, తరిగిన నట్స్‌తో కలిపి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తింటే చాలా ఎనర్జీ ఇస్తుంది. కొద్దిగా దాల్చిన చెక్క లేదా జాజికాయ పొడి కలిపితే రుచి పెరుగుతుంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ఆహారం
జీవనశైలి
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cucumber : ఎండాకాలంలో కీరదోస ఎందుకు తినాలి? ఏ టైమ్ లో తినాలి?
Recommended image2
Idli Dosa batter: ఎండాకాలం పిండి పులిసిపోతోందా? పిండి రుబ్బేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు, ఫ్రెష్ గా ఉంటుంది
Recommended image3
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
అవకాడో వంటకాలు: బ్రేక్ ఫాస్ట్ నుండి డెజర్ట్ వరకు..
Recommended image2
బంగాళాదుంప తొక్కతో కూడా మొటిమలు తగ్గించుకోవచ్చు. ఎలాగంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved