PM Modi: మోదీ పర్యటనలో అనుకోని సంఘటన.. అప్రమత్తమైన ఎస్పీజీ కమాండర్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. అమరావతి నిర్మాణంలో తన భుజాన్ని కలుపుతానని, మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు పవన్‌పై ప్రశంసలు కురిపించారు మోదీ.

Narendra Modi,Chandrababu Naidu, Andhra Pradesh,
ఇదిలా ఉంటే అమరావతి రాజధాని పునర్నిర్మాణ ప్రారంభ సభ అంచనా వేసిన సమయానికి ప్రారంభమవ్వకపోవడంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ముందు షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం మే 3వ తేదీ సాయంత్రం 4.45 గంటలకు ముగించాల్సి ఉంది. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర అతిథుల ప్రసంగాల కారణంగా సభ దాదాపు గంట పాటు ఆలస్యమైంది.
Pawan Kalyan, Narendra Modi,
సాయంత్రం 4.30 గంటల నుంచే వాతావరణం ఒక్కసారిగా మారింది. వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ అలర్ట్‌తో హెలికాప్టర్ల టేకాఫ్‌పై సందేహాలు మొదలయ్యాయి. సెక్యూరిటీ వర్గాలైన ఎస్పీజీ (SPG) , రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
Pawan Kalyan, Narendra Modi, Amaravati, Andhra Pradesh,
అవసరమైతే మోదీని రోడ్డు మార్గంలో గన్నవరం తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. హెలికాప్టర్లకు 6 గంటల తర్వాత టేకాఫ్ సురక్షితంగా ఉండదని పైలట్లు స్పష్టం చేశారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గంగా రోడ్డు మార్గం ద్వారా ప్రధానిని విజయవాడ విమానాశ్రయానికి తరలించే ఏర్పాట్లు కూడా పరిశీలించారు.
Modi speech in Amaravati
అయితే, ప్రధాన మంత్రి కాన్వాయ్ సాయంత్రం 5.45కి బయలు దేరింది. దీంతో సభ వేదిక నుంచి బయలుదేరి 5.52కి హెలిప్యాడ్‌కు చేరుకున్నారు ప్రధాని. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే 5.57కి హెలికాప్టర్లు ఎటువంటి అంతరాయం లేకుండా విజయవాడకు బయలుదేరాయి. చివరకు టేకాఫ్ సజావుగా పూర్తికావడంతో అధికారులందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Pawan Kalyan, Narendra Modi
చిన్న ఆలస్యమే అయినా, దేశ ప్రధానమంత్రికి సంబంధించిన హెలికాప్టర్ ప్రయాణంలో సమయపాలన ఎంత కీలకమో ఈ ఘటన చెప్పకనే చెప్పంది. వాతావరణం, వెలుతురు, భద్రతా కారణాలతో ఏర్పడే ఒక్కో నిమిషం ఆలస్యం ఎంతటి ఉత్కంఠ కలిగిస్తుందో ఈ సంఘటన స్పష్టం చేసింది.