- Home
- Business
- Skype: స్కైప్ శకం ముగిసింది.. మీ అకౌంట్స్, డేటా జాగ్రత్త.. ఎందుకు మూసేస్తున్నారో తెలుసా?
Skype: స్కైప్ శకం ముగిసింది.. మీ అకౌంట్స్, డేటా జాగ్రత్త.. ఎందుకు మూసేస్తున్నారో తెలుసా?
Skype: వీడియో కాల్ అంటే స్కైప్ కాల్ అనేంతగా గుర్తింపు పొందిన స్కైప్ ఇక క్లోజ్ అవుతోంది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీయే కన్ఫర్మ్ చేసింది. దీనికి కారణాలు ఏంటో వివరాలు తెలుసుకుందాం రండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ చేస్తున్న ప్లాట్‌ఫారమ్ స్కైప్ అధికారికంగా ఆగిపోతోంది. మే 5, 2025 నుండి స్కైప్ అందుబాటులో ఉండదని మైక్రోసాఫ్ట్ ధృవీకరించింది. దీంతో డిజిటల్ కమ్యూనికేషన్లో ఒక శకం ముగిసినట్లు అవుతుంది. ఈ చర్యతో ఫ్రీ సబ్‌స్క్రైబర్స్, పెయిడ్ సబ్‌స్క్రైబర్స్ కూడా ఇబ్బంది పడునున్నారు. అయితే స్కైప్ ఫర్ బిజినెస్ పనిచేస్తూనే ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
స్కైప్ ఎందుకు ఆగిపోతోంది?
వినియోగదారులను కొత్త ప్లాట్‌ఫారమ్ అయిన మైక్రోసాఫ్ట్ ‘టీమ్స్ ఫ్రీ’కి మార్చడానికి మైక్రోసాఫ్ట్ స్కైప్‌ను దశలవారీగా తొలగిస్తోంది. ఆధునిక యాప్ వీడియో, వాయిస్ కాల్స్, మెసేజింగ్, ఫైల్ షేరింగ్ వంటి ప్రధాన టాస్క్ లను స్కైప్ నిర్వహిస్తుంది. వినియోగదారులకు మెరుగైన సహకారం కోసం ‘టీమ్స్ ఫ్రీ’ ద్వారా కొత్త యాక్టివిటీస్ ని కూడా పరిచయం చేస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
మీ స్కైప్ అకౌంట్, డేటా ఏమవుతుంది?
గుడ్ న్యూస్ ఏంటంటే స్కైప్ ప్లేస్ లో వస్తున్న ‘టీమ్స్ ఫ్రీ’ని వినియోగదారులు మొదటి నుండి ప్రారంభించాల్సిన అవసరం లేదు. స్కైప్ అకౌంట్ హోల్డర్స్ టీమ్స్ ఫ్రీకి యాక్సిస్ చేసేలా మైక్రోసాఫ్ట్ పర్మీషన్స్ ఇస్తోంది.
అంటే ‘టీమ్స్ ఫ్రీ’ని యాక్సెస్ చేయడానికి మీరు మీ ప్రస్తుత స్కైప్ లాగిన్ ఆధారాలను ఉపయోగించవచ్చు. మీరు లాగిన్ అయినప్పుడు మీ చాట్‌లు, కాంటాక్ట్ జాబితా టీమ్స్ ఫ్రీలో కనిపిస్తుంది. దీంతో ‘టీమ్స్ ఫ్రీ’లో ప్రత్యేకంగా అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు.
స్కైప్‌ను ఎప్పటివరకు ఉపయోగించవచ్చు?
మే 5, 2025 వరకు స్కైప్ సేవలు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు మైగ్రేట్ చేయడానికి తగినంత సమయం ఇస్తుంది. ఈ పరివర్తన కాలంలో స్కైప్, టీమ్స్ ఫ్రీ రెండింటినీ పక్కపక్కనే ఉపయోగించవచ్చు. టీమ్స్ ఫ్రీలోకి లాగిన్ అవ్వడం వల్ల స్కైప్‌కు యాక్సెస్ వెంటనే రద్దు అవ్వదు.
టీమ్స్ ఫ్రీ లో ఇది ఉండదు
స్కైప్ నుంచి టీమ్స్ ఫ్రీ లోకి చాలా డేటా మైగ్రేట్ అవుతుందట. కాని కొన్ని చాట్ రకాలు, కంటెంట్ బదిలీ అవ్వదని మైక్రోసాఫ్ట్ తెలిపింది. స్కైప్, స్కైప్ ఫర్ బిజినెస్ మధ్య చాట్‌లు, ప్రైవేట్ సంభాషణలు 1:1 చాట్
బాట్‌లు, కోపైలట్ కంటెంట్ టీమ్స్ వర్క్ సంభాషణలను కొనసాగించడానికి వినియోగదారులు టీమ్స్ ఫ్రీలో కొత్త చాట్‌లను ప్రారంభించాల్సి ఉంటుంది. స్కైప్ డేటా ట్రాన్స్ ఫర్ గురించి అకౌంట్ హోల్డర్స్ పట్టించుకోకపోతే జనవరి 2026లో స్కైప్ డేటాను శాశ్వతంగా తొలగిస్తారు.