జగన్ పై దాడి: సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే

By Nagaraju TFirst Published Nov 13, 2018, 5:51 PM IST
Highlights

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాడి ఘటనలో సూత్రధారి, పాత్రధారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని ఆపార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ పై దాడి ఘటనకు సంబంధించి వివరాలను రాష్ట్రపతి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వివరించారు. 

ఢిల్లీ: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాడి ఘటనలో సూత్రధారి, పాత్రధారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని ఆపార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ పై దాడి ఘటనకు సంబంధించి వివరాలను రాష్ట్రపతి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వివరించారు. 

విజయసాయిరెడ్డితోపాటు మాజీ ఎంపీల బృందం రామ్ నాథ్ కోవింద్ ను కలిసి జగన్ పై దాడి కేసును థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని కోరారు. ఘటనకు సంబంధించి వైసీపీ నేతల అనుమానాలను రామ్ నాథ్ కోవింద్ కు వివరించినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. 

వైఎస్ జగన్ పై దాడి కేసుకు సంబంధించి కర్త,ఖర్మ, క్రియ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అందుకు తగ్గ ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. హత్య కేసు కుట్రదారుల్లో చంద్రబాబుతోపాటు కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, సినీనటుడు శివాజీ, రెస్టారెంట్ ఓనర్ హర్షవర్థన్ లు ఉన్నారని తెలిపారు. 

నిందితుడు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు కాబట్టి థర్డ్ పార్టీతో విచారణ జరిపితే మరింత మంది కుట్రదారులు వెలుగులోకి వస్తారన్నారు. జగన్ హత్య కేసులో చంద్రబాబు ప్రమేయం లేకపోతే ఆయనే నేరుగా రాష్ట్రపతిని కలిసేవారని దాడిపై వివరణ ఇచ్చేవారన్నారు. 

చంద్రబాబు నాయుడు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే నిష్పక్షపాతంగా విచారణ జరిపే సంస్థలతో విచారణ చెయ్యమని కోరేవారన్నారు. అలా చెయ్యకుండా నిందారోపణలు చేస్తున్నారంటే తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే వైఎస్ జగన్ పై దాడి ఘటనకు సంబంధించి థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని పలువురు కేంద్రమంత్రులను, జాతీయ స్థాయి నేతలను వైసీపీ నేతలు కలిసి కోరారు. 

ఈ వార్తలు కూడా చదవండి


హైదరాబాద్: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌‌పై దాడి  కేసులో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు హైకోర్టు  మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో  వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై ఈ ఏడాది అక్టోబర్ 25వ తేదీన విశాఖ  ఎయిర్‌పోర్ట్‌లో శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటనపై  థర్డ్ పార్టీ విచారణను  కోరుతూ జగన్ ‌హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసు విచారణను మంగళవారం నాడు  చేసింది.ఈ విచారణలో భాగంగా సిట్ దర్యాప్తు నివేదికను హైకోర్టు కు ఏజీ సమర్పించారు. మరో వైపు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సీసీటీవీ పుటేజీ లేకపోవడం, భద్రత లోపాలపై  హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

మరో వైపు ఈ కేసులో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ డీజీపీ ఆర్ప్ ఠాకూర్, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు ఎనిమిది మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి కేసు: చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

జగన్‌పై దాడి: పర్మిట్ లేని శ్రీనివాస్ అక్కడికి ఎలా వెళ్లాడు

జగన్‌పై దాడి: సీసీకెమెరాల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం

జగన్ పై దాడి కేసు.. నేడు హైకోర్టులో విచారణ

జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే

జగన్‌ను ప్రజలే కాపాడుకొన్నారు: కన్నీళ్లు పెట్టుకొన్న విజయమ్మ

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌కు 120 కాల్స్, ఎవరీ కేకే

జగన్ పై దాడి.. హైకోర్టు సంచలన కామెంట్స్

జగన్‌పై దాడి: జోగి రమేష్‌ విచారణ, గుంటూరులో ఉద్రిక్తత

జగన్ పై దాడి కేసు:విచారణకు హాజరైన జోగి రమేష్

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?

జగన్ మీద దాడిపై జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగన్‌కేసు దర్యాప్తు: శ్రీనివాస్ దుబాయ్‌లో వెల్డర్, హైద్రాబాద్‌లో కుక్

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: ఆ యువతులే కీలకం

జగన్‌పై దాడి కేసు...శ్రీనివాస్‌ మళ్లీ జైలుకే

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

మానని జగన్ గాయం: కత్తికి విషం లేదు

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: శ్రీనివాస్‌తో వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ సంభాషణ

జగన్‌పై దాడి.. బొత్స మేనల్లుడి హస్తం: నక్కా ఆనంద్‌బాబు

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

చంద్రబాబు చిన్నమెదడు చితికింది ఆయన ఓ ఉన్మాది: బొత్స ఫైర్

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స

టీడీపీదే కుట్ర... శ్రీనివాసరావు కోటి రూపాయల ల్యాండ్ డీల్ : రోజా

జగన్‌పై దాడి: కడప వెళ్తున్న చంద్రబాబు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు

దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

 

click me!