గుంటూరు:వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తిదాడి ఘటనలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే  జోగి రమేష్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. పోలీసులు జోగి రమేష్ చేసిన ఆరోపణలపై ఆరా తీస్తున్నారు.
  
 
జగన్ పై దాడి ఘటన అనంతరం దాడి చేయించింది చంద్రబాబు నాయుడేనని దాడి చేసింది టీడీపీ కార్యకర్తేనని జోగి రమేష్ ఆరోపించారు. తన దగ్గర ఆధారాలున్నాయంటూ నిందితుడు శ్రీనివాస్ టీడీపీ సభ్యత్వనమోదు కార్డును బహిర్గతం చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, ఏపీఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య జోగి రమేష్ పై గుంటూరు జిల్లా ఆరండల్ పేట పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 

దీంతో జోగి రమేష్ ను విచారణకు హాజరుకావాల్సిందిగా ఈనెల 3న ఆరండల్ పేట పోలీసులు జోగిరమేష్ కు నోటీసులు ఇచ్చారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను తీసుకురావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జోగిరమేష్ విచారణలో భాగంగా ఆరండల్ పేట పీఎస్ కు చేరుకున్నారు. తన ఆరోపణలపై పోలీసులకు వివరించారు. అలాగే తన దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పించారు. 

నిందితుడు శ్రీనివాస్ టీడీపీ కార్యకర్త అనడానికి ఆధారంగా అతని టీడీపీ సభ్యత్వ నమోదు కార్డును పోలీసులకు అందజేశారు.  

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ పై దాడి కేసులో ట్విస్ట్: జోగిరమేష్ కు నోటీసులు

జగన్ మీద దాడిపై జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?

జగన్‌కేసు దర్యాప్తు: శ్రీనివాస్ దుబాయ్‌లో వెల్డర్, హైద్రాబాద్‌లో కుక్

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: ఆ యువతులే కీలకం

జగన్‌పై దాడి కేసు...శ్రీనివాస్‌ మళ్లీ జైలుకే

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు