Asianet News TeluguAsianet News Telugu

అరే పొత్తుపైనే క్లారిటీ లేదు, ఇక సీట్లెక్కడ, దూతలెక్కడ:కోదండరాం

ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటుపై గందరగోళం నెలకొంది. సీట్ల సర్దుబాటు నేపథ్యంలో భాగస్వామ్య పార్టీలకు దూతలను పంపించినట్లు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. తమ దగ్గరకు ఎలాంటి దూతలు రాలేదని టీజేఎస్,సీపీఐ పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. 

tjs president kodandaram sensetional comments
Author
Hyderabad, First Published Oct 31, 2018, 8:45 PM IST

హైదరాబాద్: ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటుపై గందరగోళం నెలకొంది. సీట్ల సర్దుబాటు నేపథ్యంలో భాగస్వామ్య పార్టీలకు దూతలను పంపించినట్లు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. తమ దగ్గరకు ఎలాంటి దూతలు రాలేదని టీజేఎస్,సీపీఐ పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. 

పొత్తు ప్రతిపాదనపైనే చర్చిస్తున్నామే తప్ప పొత్తు కన్ఫమ్ కాలేదని కోదండరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు కన్ఫమ్ అయితే సీట్ల సర్దుబాటు దూతలు గురించి మాట్లాడుకోవచ్చునని తెలిపారు. 

టీడీపీకి 14, టీజేఎస్ 8, సీపీఐ4 సీట్లు కేటాయించినట్లు సమాచారం. ఇదే జాబితాతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాతో కలిసి ఉత్తమ్ జాబితాను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించారు.

ఇకపోతే గురువారం ఉదయం యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సెంట్రల్ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు పొత్తు అంశాలపై ఓక్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్లు తమ దగ్గరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు దూతలు అంటూ తమ వద్దకు రాలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. నాలుగు సీట్లకే సర్దుకు పోయిందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. తాము మెత్తబడ లేదని గట్టిగానే ఉన్నామని స్పష్టం చేశారు. 

టీజేఎస్ పార్టీ కార్యాలయం దగ్గరకు కానీ, తన దగ్గరకు కానీ దూతలెవరూ రాలేదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు. పొత్తుల్లో భాగంగా టీజేఎస్ కు 8 సీట్లు వరకు చర్చ వచ్చి అక్కడే నిలిచిపోయిందని ఆనాటి నుంచి ఇప్పటి వరకు చర్చలు జరగలేదన్నారు. ప్రజాకూటమి అనేది ఇంకా ఏర్పడ లేదని కేవలం ఏర్పడితే ఎలా ఉంటుంది అన్నదానిపైనే చర్చలు జరిగాయని చెప్పారు.

ప్రజాకూటమిలో కాంగ్రెస్ పార్టీయే పెద్దన్న పాత్ర పోషించాలని అయితే ఆ పార్టీ ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదన్నారు. కానీ లీకుల పేరుతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తోందని దాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. 

ఇప్పటికైనా ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు పొత్తు అంశాలు ఓ కొలిక్కి వస్తే పర్వాలేదని కానీ ఇంకా ఆలస్యం చేస్తే తమదారేదో తామే చూసుకుంటామని తెలిపారు. ఉంటే ప్రజాకూటమిలో ఉంటామని లేని పక్షంలో ఒంటరిగా బరిలోకి దిగుతామే తప్ప మరో పార్టీతో పొత్తుపెట్టుకోబోమని తేల్చి చెప్పారు. 

ఇకపోతే సీట్ల సర్దుబాటు, పొత్తు అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతోనే తేల్చుకునేందుకు రెడీ అయినట్లు కోదండరామ్ తెలిపారు. తమ పార్టీ సిద్ధాంతాలు సీట్ల సర్దుబాటుపై నేరుగా తేల్చుకుంటామని ఉంటే కూటమిలో ఉంటాం లేకపోతే ఒంటరిగా బరిలోకి దిగుతామని తేల్చిచెప్పారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కోదండరామ్ కు రాహుల్ ఫోన్: రేపు ఢిల్లీకి పయనం

సీట్ల లొల్లి: రాహుల్‌‌తోనే తేల్చుకొనేందుకు కోదండ రెడీ

నవంబర్ రెండున జాబితా విడుదల: ఆ పార్టీలకు ఇచ్చే సీట్లు ఇంతే

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

Follow Us:
Download App:
  • android
  • ios