హైదరాబాద్: నవంబర్ రెండో తేదీన మహా కూటమి (ప్రజా కూటమి) అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.  టీడీపీకి 13, టీజేఎస్‌కు 6, సీపీఐ కు4 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రతిపాదించింది.తాజా ప్రతిపాదనలతో  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. 

కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న  నిర్లక్ష్య వైఖరితో  బుధవారం నాడు  టీడీపీ,  టీజేఎస్, సీపీఐ నేతలు  సమావేశమయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఇంట్లో మిగిలిన ఇద్దరు నేతలు సమావేశమయ్యారు.

తాజా ప్రతిపాదనలతో  కాంగ్రెస్ పార్టీ నేతలు  కూటమిలోని  ఇతర పార్టీల నేతలతో బుజ్జగింపులకు దిగారు. టీజేఎస్ చీఫ్ కోదండరామ్,  సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిలతో కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చలకు వెళ్లారు.

కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి,  షబ్బీర్ అలీలు ఢిల్లీకి వెళ్లారు. గురువారం నాడు (నవంబర్ 1) ఉదయం పదకొండు గంటలకు  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ  సమావేశం కానుంది. ఈ సమావేశంలో   కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేయనుంది.

బుధవారం నాడు సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఇంట్లో టీడీపీ, టీజేఎస్‌ నేతలు సమావేశం కావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ తేగేవరకు లాగకూడదని భావించారు.ఈ తరుణంలో  టీజేఎస్, సీపీఐ నేతలతో కాంగ్రెస్ ముఖ్య నేతలు బుజ్జగిస్తున్నారు.  నవంబర్ రెండో తేదీన  ప్రజా కూటమి నేతల అభ్యర్థుల జాబితాను  విడుదల చేయనున్నారు.

వాస్తవానికి  నవంబర్ ఒకటో తేదీనే ప్రజా కూటమితో సంబంధం లేని  అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు భావించారు. కానీ, అష్టమి కారణంగా అభ్యర్థుల జాబితాను నవంబర్ రెండో తేదీకి వాయిదా వేశారు. తొలి జాబితాలో కనీసం 40 నుండి 50 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. 

కూటమిలో ఇతర పార్టీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్ల  పరోక్షంగా టీఆర్ఎస్‌కు ప్రయోజనం కల్గించేలా చేయకూడదనేది  కాంగ్రెస్ పార్టీ అభిమతంగా కన్పిస్తోంది. గెలిచే స్థానాలను వదులుకోవద్దని ఆ పార్టీ భావిస్తోంది. 

టీజేఎస్, సీపీఐలకు తక్కువ స్థానాలను కేటాయించడంలో కాంగ్రెస్ పార్టీ ప్లాన్ కూడ అదే. మరో వైపు తాము అధికారంలోకి వస్తే భాగస్వామ్య పార్టీలకు కార్పోరేషన్ పదవులు,ఇతర నామినేటేడ్ పదవులను కట్టబెడతామని  కాంగ్రెస్ పార్టీ భరోసాను ఇస్తోంది. అయితే  ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని భాగస్వామ్య పార్టీలు కూడ కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న సీట్లను తీసుకొనేందుకు కొంత సానుకూలతను వ్యక్తం చేసినట్టు సమాచారం. 
 

సంబంధిత వార్తలు

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?