Asianet News TeluguAsianet News Telugu

కోదండరామ్ కు రాహుల్ ఫోన్: రేపు ఢిల్లీకి పయనం

ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటుపై అమితుమీకి రెడీ అవుతున్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి పిలుపు వచ్చింది. రాహుల్ గాంధీ తనను కలవాలంటూ కోదండరామ్ కు ఫోన్ చేశారు. శుక్రవారం ఉదయం 9.30గంటలకు కోదండరామ్ కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చారు. 

congress president calls kodandaram, discuss on seats and election campaign
Author
Hyderabad, First Published Oct 31, 2018, 7:28 PM IST

హైదరాబాద్: ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటుపై అమితుమీకి రెడీ అవుతున్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి పిలుపు వచ్చింది. రాహుల్ గాంధీ తనను కలవాలంటూ కోదండరామ్ కు ఫోన్ చేశారు. శుక్రవారం ఉదయం 9.30గంటలకు కోదండరామ్ కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈనేపథ్యంలో కోదండరామ్ గురువారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరనున్నారు. 

అనంతరం శుక్రవారం రాహుల్ గాంధీతో సీట్ల సర్దుబాటు ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై కోదండరామ్ చర్చించనున్నారు. అలాగే సీట్ల సర్దుబాటుపై కూడా ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై కోదండరామ్ కాంగ్రెస్ పార్టీకి డెడ్ లైన్ విధించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నుంచి ఫోన్ రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇదిలా ఉంటే సీట్ల సర్దుబాటుపై ప్రజాకూటమిలో మరో భాగస్వామ్య పార్టీ సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీట్ల కేటాయింపుల్లో తాము మెత్తబడలేదని గట్టిగానే ఉన్నామని స్పష్టం చేసింది. ప్రజాకూటమిలో సీట్ల కేటాయింపులో సీపీఐ 4 సీట్లకు ఒప్పుకుందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.  

ప్రజాకూటమిలో కాంగ్రెస్‌దే పెద్దన్న పాత్ర అని సీట్లు సర్దుబాటు చేయాల్సింది కాంగ్రెస్సే అని చాడ పేర్కొన్నారు. సీపీఐకి కాంగ్రెస్ ఓట్లు ఎంత అవసరమో, కాంగ్రెస్‌కు సీపీఐ ఓట్లు కూడా అంతే అవసరం అని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరిగితేనే కూటమి విజయం సాధిస్తుందన్నారు. అభ్యర్థులను ప్రకటించకుండానే కాంగ్రెస్ ప్రచారం చేయడం సరికాదన్నారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

సీట్ల లొల్లి: రాహుల్‌‌తోనే తేల్చుకొనేందుకు కోదండ రెడీ

నవంబర్ రెండున జాబితా విడుదల: ఆ పార్టీలకు ఇచ్చే సీట్లు ఇంతే

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

 

Follow Us:
Download App:
  • android
  • ios