తెలంగాణ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మక పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో కొడంగల్ నియోజకవర్గం ఒకటి. తెలంగాణ వ్యాప్తంగా రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ నియోజవర్గంలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, అలజడులు జరక్కుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దనం, మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇలా నియోజకవర్గంలోని కోస్గి మండల పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు భారీ ఎత్తున నగదు పట్టుకున్నారు. 

బలభద్రయ్యపల్లి గ్రామంలొ తనిఖీలు నిర్వహించిన పోలీసులు రూ.50లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు టీఆర్‌ఎస్‌ వర్గీయులదిగా పోలీసులు  అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

 కొడంగల్ నియోజకవర్గం నుండి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రజాకూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.ఆయనకు గట్టి పోటీ ఇచ్చేందకు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిని టీఆర్ఎస్ బరిలోకి దింపింది. దీంతో ఇద్దరు బలమైన నాయకులు పోటీపడుతుండటంతో కొడంగల్ పోరు రసవత్తరంగా మారింది.   

అయితే ఇటీవలే నరేందర్‌రెడ్డి బంధువు ఫామ్‌హౌస్‌లో భారీగా డబ్బులు పట్టుబడటం....దీనిపై పోలీసులు, ఈసీ చర్యలు తీసుకోకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఇదే సమయంలో తన అనుచరులతో పాటు తనపై కూడా పోలీసులు అనవసరంగా దాడులు చేస్తున్నారని ఫిర్యాదు కూడా చేశాడు. పోలీసుల సాయంతో నరేందర్ రెడ్డి అక్రమంగా డబ్బులు పంచుతున్నాడని కూడా ఆరోపించారు. ఈ క్రమంలో తాజాగా డబ్బులు పట్టుబడటం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు

 

డీజీపీ మా ముందుకు రావాలి...రేవంత్ అరెస్ట్‌పై హైకోర్టు ఆదేశం

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్