Asianet News TeluguAsianet News Telugu

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్‌లో ఓ మహిళను హత్య చేసిన కేసు నమోదైంది. ఈ కేసుపై కూడ బొమ్మలరామారం పోలీసులు ఆరా తీస్తున్నారు.
 

kurnool police was filed a case against srinivas reddy in 2016
Author
Bhuvanagiri, First Published Apr 30, 2019, 11:32 AM IST

భువనగిరి: హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్‌లో ఓ మహిళను హత్య చేసిన కేసు నమోదైంది. ఈ కేసుపై కూడ బొమ్మలరామారం పోలీసులు ఆరా తీస్తున్నారు.

కర్నూల్‌లో 2016‌లో ఓ మహిళను హత్య చేసిన కేసులో శ్రీనివాస్ రెడ్డి ప్రధాన నిందితుడుగా ఉన్నాడు.  రాచకొండ కమిషనరేట్‌ పరిదిలోని సీఐ ఆశోక్ నేతృత్వంలో పోలీసులు సోమవారం నాడు కర్నూల్ వెళ్లారు. 2016లో మహిళ హత్య కేసుకు సంబంధించి ఆరా తీశారు.

కర్నూల్ పట్టణంలోని వెంకటరమణ కాలనీలో బిర్వారీ అపార్ట్‌మెంట్‌ పెంట్ హౌస్‌లో శ్రీనివాస్ రెడ్డి నివాసం ఉండేవాడు. ఆ సమయంలో ఆయన ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేసేవాడు. అయితే 2016 డిసెంబర్ 27వ తేదీన శ్రీనివాస్ రెడ్డి తన రూమ్‌కు ఓ మహిళను తీసుకొచ్చాడు. 

అనంతరం ఆమెతో డబ్బు విషయంలో గొడవ రావడంతో  తన నలుగురు మిత్రులతో కలిసి ఆమెను చంపేశాడు.  మృతదేహాన్ని పెంట్‌హౌస్‌పై ఉన్న నీళ్ల ట్యాంకులో పడేసి పరారయ్యాడు.నిందితులను  2017 మే 16వ తేదీన అరెస్ట్ చేశారు. అయితే మృతురాలు ఎవరనేది ఇంకా మిస్టరీగా ఉంది.

సంబంధిత వార్తలు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే

శ్రావణి హత్య కేసు: నిందితుడి ఇంటికి నిప్పు, ఉరేయాలని డిమాండ్

శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం, ఎస్సై వెంకటేష్ సస్పెన్షన్: సీపీ మహేశ్ భగవత్

లిఫ్ట్ ఇచ్చి నమ్మించేవాడు, ఆ తర్వాత దారుణాలకు పాల్పడేవాడు : హజీపురా హత్యలపై సీపీ మహేశ్ భగవత్

శ్రావణిని హత్య చేసిన తర్వాత నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఏం చేశాడంటే...?

హజీపూర్ బాధితులను పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి: బాధితులకు రూ.లక్ష ఆర్థికసాయం

మృతురాలు మనీషా దయనీయ పరిస్థితి, తల్లిలేదు: బోరుమంటున్న స్థానికులు, బంధువులు

శ్రావణి హత్య కేసు: మూడు చొక్కాలు మార్చిన శ్రీనివాస్ రెడ్డి

శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి: హాజీపూర్ గ్రామస్తుల డిమాండ్

రాఘవన్ సినిమాలో మాదిరిగానే: హాజీపూర్‌లో విద్యార్థినుల హత్యలు

శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే

షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం

శ్రావణి రేప్‌, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం

శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన

శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

Follow Us:
Download App:
  • android
  • ios