ఇద్దరు విద్యార్ధినులను హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలని హాజీపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని ఉరి తీయాలని ముక్త కంఠంతో కోరుతున్నారు.
భువనగిరి: ఇద్దరు విద్యార్ధినులను హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలని హాజీపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని ఉరి తీయాలని ముక్త కంఠంతో కోరుతున్నారు.
హాజీపూర్ గ్రామంలో వరుసగా విద్యార్థినుల మృతదేహాలు బయట పడడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మనీషా మృతదేహాన్ని సోమవారం నాడు మధ్యాహ్నం వెలుగు చూసింది. శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు మనీషా మృతదేహం వెలికి తీశారు.
మనీషా మృతదేహం వెలికి తీసిన తర్వాత గ్రామస్తులు తీవ్రంగా స్పందించారు. శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి ఆస్తిని మృతుల కుటుంబాలకు పంచాలని కోరారు.
శ్రీనివాస్ రెడ్డిని తమ గ్రామ పంచాయితీ వద్దకు తీసుకొచ్చి నరికి చంపితే కానీ తమ గ్రామస్థుల్లో భయం తొలగదని కొందరు గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. వరంగల్‌లో యువతిపై యాసిడ్ పోసిన ఘటనలో నిందితుడిని ఆనాడు ఎస్పీగా ఉన్న సజ్జనార్ ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపినట్టుగా చంపేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
రాఘవన్ సినిమాలో మాదిరిగానే: హాజీపూర్‌లో విద్యార్థినుల హత్యలు
శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే
షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం
శ్రావణి రేప్, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం
శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన
శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు
శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు
శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత
శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)
శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు
