హాజీపూర్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. శ్రావణి హత్య కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటిని గ్రామస్తులు ముట్టడించి, నిప్పుపెట్టారు.

శ్రావణి, మనీషాల అత్యాచారం, హత్యలతో రగిలిపోతున్న గ్రామస్తులు శ్రీనివాస్ రెడ్డిని తమకు అప్పగించాలని.. వూరిలో ఉరి వేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో అతని ఇంటి వద్దవున్న పోలీసులు జనాన్ని అడ్డుకున్నారు. రేపిస్టు శ్రీనివాస్ రెడ్డి ఇంకెందరు బాలికలను చంపేశాడోనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.