యాదాద్రి: తెలంగాణలోని భువనగిరి యాదాద్రి జిల్లాలో సంచలనం సృష్టించిన విద్యార్థిని శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. ఈ విషయాన్ని పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ శనివారం వెల్లడించారు 

సిట్ లో ఎస్ వోటీ డీసీపి సురేందర్ రెడ్డి, డిసీపి సలీమా, ఐటి సెల్ అధికారులతో ఆ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. కేసు విచారణలో నిర్లక్ష్యం వహించిన బొమ్మల రామారం ఎస్ఐ వెంకటేశ్ పై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు 

శ్రావణి హత్య కేసులో పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, శ్రావణి మృతదేహానికి భువనగిరిలోని ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుని పదో తరగతి ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న శ్రావణిని దుండగులు హత్య చేసి నీళ్లు లేని బావిలో శవాన్ని పాతిపెట్టిన విషయం తెలిసిందే. హత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. 

సంబంధిత వార్తలు

శ్రావణి హత్య కేసు: బొమ్మల రామారం ఎస్ఐపై వేటు

తొమ్మిదో తరగతి విద్యార్థిపై దారుణం: హజీజ్ పురాలో ఉద్రిక్తత