భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని హాజీపూర్‌లో మరో దారుణం వెలుగు చూసింది. పదో తరగతి విద్యార్థిని శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే మరో బాలిక మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.

పదో తరగతి విద్యార్ధిని శ్రావణి స్కూల్ నుండి తిరిగి వస్తూ అదృశ్యమైంది. చివరికి ఆమె మృతదేహన్ని గ్రామానికి సమీపంలోని పాడుబడిన బావిలో కనుగొన్నారు.ఈ కేసులో ఇప్పటికే గ్రామానికి చెందిన పాత నేరస్తుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

అయితే ఇదే  సమయంలో అదే బావిలో మరో బాలిక మృతదేహం కూడ  లభ్యం కావడం గ్రామంలో సంచలనంగా మారింది. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. తాజాగా దొరికిన మృతదేహం మనీషా అనే బాలికదిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే మనీషాకు చెందిన కాలేజీ బ్యాగు, ఆమె గుర్తింపు కార్డులు  లభ్యమయ్యాయి. మనీషా ఓ యువకుడితో ప్రేమలో పడి ఆతనితో వెళ్లి పోయి ఉంటుందని ఆమె తల్లిదండ్రులు అనుమానించారు. ఈ కారణంగానే మనీషా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

మనీషా నెల రోజులుగా అదృశ్యమైంది. మనీషా ఇంటర్ విద్యార్థిని.  నాలుగేళ్ల కాలంలో మూడు హత్యలు చోటు చేసుకొన్నాయని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ హత్యలు చేసినవారు ఎవరనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఇదే గ్రామానికి చెందిన కల్పన అనే బాలిక కూడ  అదృశ్యమై నాలుగేళ్లు దాటుతోంది.ఈ బాలిక ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఆ బాలిక ఆచూకీ ఎక్కడ కూడ లభించడం లేదని వారు పోలీసులకు చెప్పారు.

సంబంధిత వార్తలు

శ్రావణి రేప్‌, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం

శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన

శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

శ్రావణి హత్య కేసు: బొమ్మల రామారం ఎస్ఐపై వేటు

తొమ్మిదో తరగతి విద్యార్థిపై దారుణం: హజీజ్ పురాలో ఉద్రిక్తత