భువనగిరి: యాదాద్రి జిల్లా బీబీనగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని హజీపూర్‌కు చెందిన శ్రావణి హత్యకేసు ఘటన గ్రామంలో విషాదం చోటు చేసుకొంది. శ్రావణి హత్య కేసును పరిశోధిస్తున్న పోలీసులకు సంచలన విషయాలు వెలుగు చూశాయి. నాలుగేళ్ల క్రితం కల్పన అనే విద్యార్థిని కూడ అదృశ్యమైంది. ఇప్పటికి కూడ ఆ బాలిక ఆచూకీ దొరకలేదు.

హజీపూర్‌కు చెందిన శ్రావణిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడి హత్య చేసి ఉంటారని  పోలీసులు చెప్పారు. శ్రావణి కంటే  నాలుగేళ్ల క్రితం కూడ కల్పన అనే విద్యార్థిని అదృశ్యమైందని గ్రామస్తులు గుర్తు చేసుకొన్నారు.

ఇంతవరకు కూడ ఆమె ఆచూకీ తెలియదన్నారు. కల్పన కుటుంబసభ్యులు  కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  కల్పన ఆచూకీ ఎక్కడ ఉందో కనిపెట్టాలని కోరుతున్నారు. శ్రావణి హత్య కేసులో గ్రామానికి చెందిన కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే అమాయకులను వేధించకూడదని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

శ్రావణి హత్య కేసు: బొమ్మల రామారం ఎస్ఐపై వేటు

తొమ్మిదో తరగతి విద్యార్థిపై దారుణం: హజీజ్ పురాలో ఉద్రిక్తత