బొమ్మలరామారం: అత్యాచారం ఆపై హత్యకు గురైన డిగ్రీ విద్యార్థిని మనీషా పరిస్థితి తలచుకుని స్థానికులు కంటతడిపెడుతున్నారు. డిగ్రీ చదువుతున్న మనీషా కళాశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి ఆ తర్వాత తిరిగి రాలేదు. 

మనీషా ఉందో లేదో ఎక్కడికి వెళ్లిందో అనే ఆరా కూడా తియ్యలేదు కుటుంబ సభ్యులు. గతంలో మనీషా ఒకసారి ఇంటి నుంచి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చింది. అలాగే తిరిగి వెళ్లిందని అంతా భావించారు. అంతేకాదు మనీషా అక్కలు ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. 

మనీషా తల్లి చాన్నాళ్ల క్రితం చనిపోయింది. తండ్రి ఉన్నా గానీ అంతగా ఏమీ తెలియని పరిస్థితి. దీంతో మనీషా ఆలనా పాలనా పట్టించుకునేవారే కరువయ్యారు. అయితే గతంలో ఒకసారి అలాగే వెళ్లి మళ్లీ తిరిగిరావడంతో అలాగే వెళ్లిందని కుటుంబ సభ్యులు భావించారు. 

ఆఖరికి పోలీస్ కేసు కూడా నమోదు చెయ్యాలేదు. అయితే శ్రావణి హత్య కేసు విచారణలో మనీషాను తానే హత్య చేసినట్లు నిందితుడు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తండ్రి నుంచి ఫిర్యాదు తీసుకుని విచారణ చేపట్టారు. 

శ్రావణి మృతదేహం లభించిన బావిలోనే మనీషా మృతదేహం లభించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మనీషా హత్యకు గురైందని తెలుసుకున్న అక్కయ్యలు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. 

స్నేహితుల ఇంటికి వెళ్లిందని తిరిగి వస్తుందని అంతా అనుకున్నామని కానీ ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుందని ఊహించలేదని వారు బోరున విలపించారు. తన చెల్లి చావుకు కారణమైన నిందితుడుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

శ్రావణి హత్య కేసు: మూడు చొక్కాలు మార్చిన శ్రీనివాస్ రెడ్డి

శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి: హాజీపూర్ గ్రామస్తుల డిమాండ్

రాఘవన్ సినిమాలో మాదిరిగానే: హాజీపూర్‌లో విద్యార్థినుల హత్యలు

శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే

షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం

శ్రావణి రేప్‌, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం

శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన

శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

శ్రావణి హత్య కేసు: బొమ్మల రామారం ఎస్ఐపై వేటు