Asianet News TeluguAsianet News Telugu

శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే

హజీపూర్‌లో వరుస హత్య కేసులో  శ్రీనివాస్ రెడ్డి అనే నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు గ్రామం వదిలి పారిపోయారు. శ్రీనివాస్ రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి

police arrested srinivas reddy for hazipur murder cases
Author
Hyderabad, First Published Apr 29, 2019, 5:24 PM IST

భువనగిరి: హజీపూర్‌లో వరుస హత్య కేసులో  శ్రీనివాస్ రెడ్డి అనే నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు గ్రామం వదిలి పారిపోయారు. శ్రీనివాస్ రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి.

హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి కీసరలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. శ్రావణితో పాటు మనీషాలను శ్రీనివాస్ రెడ్డి హత్య చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

హజీపూర్‌లోని బావిలో శ్రావణి మృతదేహం దొరికిన బావిలో ఇవాళ పోలీసులు  మరోసారి  సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం ప్రయత్నించారు. అయితే  బావిలో దుర్వాసన రావడంతో పాటు మృతదేహనికి చెందిన ఎముక కన్పించింది. దీంతో ఈ ప్రాంతంలో పోలీసులు తవ్వితే మనీషా మృతదేహం బయట పడింది

మనీషా మృతదేహం దొరికిన చోట ఆమె కాలేజీ బ్యాగ్, గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు లభ్యమైందని పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి బావిలోకి దిగి  సులభంగా పైకి రావడంలో సిద్దహస్తుడని గ్రామస్తులు చెప్పారు.

మనీషాపై అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా శ్రీనివాస్ రెడ్డి  పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడు. కర్ణాటక,హైద్రాబాద్‌లో కూడ శ్రీనివాస్ రెడ్డిపై పలు కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. 

శ్రీనివాస్ రెడ్డి సైకోగా మారాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పెళ్లి కాక పోవడంతో శ్రీనివాస్ రెడ్డి సైకోగా మారాడనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి. శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయన కుటుంబసభ్యులు గ్రామం విడిచివెళ్లిపోయారు.


సంబంధిత వార్తలు

షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం

శ్రావణి రేప్‌, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం

శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన

శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

శ్రావణి హత్య కేసు: బొమ్మల రామారం ఎస్ఐపై వేటు

తొమ్మిదో తరగతి విద్యార్థిపై దారుణం: హజీజ్ పురాలో ఉద్రిక్తత

Follow Us:
Download App:
  • android
  • ios