భువనగిరి: రాఘవన్ సినిమా తరహాలోనే హజీపూర్‌లో విద్యార్ధినుల హత్యలు చోటు చేసుకొన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సినిమాలో తరహాలోనే విలన్ ఏ రకంగా అమ్మాయిలను రేప్ చేసి హత్య  చేసి బావిలో పూడ్చి పెడతాడు. ఈ సినిమాలో చూపినట్టుగానే  హాజీపూర్‌లో విద్యార్థినుల హత్యలు చోటు చేసుకొన్నాయి.

రాఘవన్ సినిమాలో విలన్‌ అమ్మాయిలను హత్య చేసి బావిలో పూడ్చి పెడతాడు. మెడికోగా ఉన్న విలన్ అమ్మాయిలను వరుసగా చంపుతుండడం పలువురిని భయాందోళనలకు గురి చేస్తోంది. దీంతో  హీరో కమల్ హాసన్ ఈ హత్యలకు కారణమైన నిందితుడిని గుర్తించడంతో  సినిమా ముగుస్తోంది.  ఇండియాకు చెందిన మెడికో అమెరికాలో ఈ దారుణానికి పాల్పడుతాడు. ఇది సినిమా కథ.

అయితే ఇదే కథను తలపించే రీతిలో  హజీపూర్‌లో వరుసగా  విద్యార్థినుల హత్యలు చోటు చేసుకొన్నాయి. రెండు రోజుల క్రితం శ్రావణి అనే టెన్త్ విద్యార్థిని మృతదేహం వెలుగు చూసింది. శ్రావణి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు శ్రీనివాస్ రెడ్డి అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకొనే ప్రశ్నిస్తే మనీషా మృతదేహం అదే బావిలో లభ్యమైంది.

రాఘవన్ సినిమాలో మాదిరిగానే శ్రీనివాస్ రెడ్డి కూడ విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మనీషాపై అత్యాచారం చేసినట్టుగా శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకొన్నాడని సమాచారం. గ్రామం నుండి అదృశ్యమైన విద్యార్ధినుల విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదే గ్రామానికి చెందిన కల్పన అనే విద్యార్థిని ఆచూకీ కూడ ఇంతవరకు లభ్యం కాలేదు.  శ్రీనివాస్ రెడ్డిపై కర్ణాటక, హైద్రాబాద్‌లలో కూడ పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ కేసులు వెలుగు చూశాయి. అయితే నాలుగేళ్లలో ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు  విద్యార్థినులు హత్యకు గురయ్యారని గ్రామస్తులు చెబుతున్నారు. నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే

షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం

శ్రావణి రేప్‌, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం

శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన

శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

శ్రావణి హత్య కేసు: బొమ్మల రామారం ఎస్ఐపై వేటు

తొమ్మిదో తరగతి విద్యార్థిపై దారుణం: హజీజ్ పురాలో ఉద్రిక్తత