శ్రావణి రాత్రి కూడా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో గ్రామస్థులతో కలిసి వారంతా వెతకడం ప్రారంభించారు. గ్రామస్థులతో కలిసి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నాడని చెప్తున్నారు.
బొమ్మలరామారం: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శ్రావణి, మనీషా హత్య కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి వ్యహారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణిని అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఎవరికి అనుమానం రాకుండా వారితోనే గడిపాడని స్థానికులు చెప్తున్నారు.
శ్రావణి రాత్రి కూడా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో గ్రామస్థులతో కలిసి వారంతా వెతకడం ప్రారంభించారు. గ్రామస్థులతో కలిసి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నాడని చెప్తున్నారు.
మధ్యాహ్నం గ్రామస్థులతో కలిసి బొమ్మలరామారంలో స్నేహితుడి పెళ్లికి వెళ్లాడని చెప్తున్నారు. అనంతరం హజీపురా వచ్చి శ్రావణిని వెతుకుతున్న వారి బంధువులతో కలిసి వెతికారని తెలిపారు.
శ్రావణి బంధువుకు బావిలో శ్రావణి డెడ్ బాడీ ఉన్నట్లు అనుమానించారని ఆ సమయంలో కూడా శ్రీనివాస్ రెడ్డి పక్కనే ఉన్నాడని చెప్తున్నారు. డెడ్ బాడీని బయటకు తీసిన తర్వాత కూడా ఉన్నాడని అయితే ఆ మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయాడని తెలిపారు.
గతంలో కూడా శ్రీనివాస్ రెడ్డికి నేర చరిత్ర ఉందని చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలు, రేప్ కేసులు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఫేస్ నేరస్థుడులా ఉంటుందని ఆయనతో మాట్లాడటానికే బయపడేవారని చెప్తున్నారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
హజీపూర్ బాధితులను పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి: బాధితులకు రూ.లక్ష ఆర్థికసాయం
మృతురాలు మనీషా దయనీయ పరిస్థితి, తల్లిలేదు: బోరుమంటున్న స్థానికులు, బంధువులు
శ్రావణి హత్య కేసు: మూడు చొక్కాలు మార్చిన శ్రీనివాస్ రెడ్డి
శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి: హాజీపూర్ గ్రామస్తుల డిమాండ్
రాఘవన్ సినిమాలో మాదిరిగానే: హాజీపూర్‌లో విద్యార్థినుల హత్యలు
శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే
షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం
శ్రావణి రేప్, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం
శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన
శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు
శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు
శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత
శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)
