హైదరాబాద్: ప్రేమించి పెళ్లి  చేసుకొంటానని నమ్మించాడు  కానీ, వేరే యువతిని వివాహం చేసుకొన్నాడు.  తమ ప్రేమకు రెండు కుటుంబాల పెద్దలు ఒప్పుకోని కారణంగా  యువకుడు  మరో పెళ్లి చేసుకొన్నాడు.  అయితే పెళ్లాయ్యాక తన మాజీ లవర్‌పై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు  నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్‌‌లోని అమీర్‌పేట ప్రాంతానికి  చెందిన ఓ యువతితో  ఓ యువకుడు పదేళ్లుగా ప్రేమించుకొన్నారు.  అయితే వీరిద్దరూ కూడ పెళ్లి చేసుకొందామని భావించారు. అయితే వీరి పెళ్లికి రెండు కుటుంబాల పెద్దలు మాత్రం ఓప్పుకోలేదు.

దీంతో ఆ యువకుడికి దూరంగా  ఆ యువతి ఉంటుంది. అయితే ఆ యువకుడు మరో యువతిని ఇటీవలనే వివాహం చేసుకొన్నాడు. ఈ నెల 14 వ తేదీన  రాత్రి  తన మాజీ లవర్‌కు ఆ యువకుడు ఫోన్ చేశాడు.  బేగంపేట సమీపంలోని లీలానగర్‌కు రావాలని ఫోన్ చేశాడు.  

అయితే  లీలానగర్‌కు రావడానికి బాధితురాలు ఒప్పుకోలేదు. అయితే తర్వాత అతడు చెప్పిన ప్రదేశానికి బాధితురాలు వచ్చింది.  అయితే తాను మరో యువతిని వివాహం చేసుకొన్న విషయాన్ని నిందితుడు తన మాజీ లవర్‌కు చెప్పాడు.

ఈ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.  దీంతో బాధితురాలిపై  దాడి చేసి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేసిందని తెలిపారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు  నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. 

ఈ వార్తలు చదవండి

పెళ్లైన మహిళలే టార్గెట్: 10 మందికి కారులో లిఫ్టిచ్చి రేప్

ప్రియుడితో రాసలీలలు: భర్తను గొంతు కోసి చంపిన భార్య

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

అల్లుడితో అత్త అఫైర్: అడ్డు చెప్పిన కొడుకును చంపించిన తల్లి