పెళ్లైన మహిళలే టార్గెట్: 10 మందికి కారులో లిఫ్టిచ్చి రేప్

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 16, Aug 2018, 10:36 AM IST
Held for robbery, cabbie admits to raping 10 women
Highlights

రోడ్డుపై ఒంటరిగా వెళ్లే మహిళలను కత్తితో బెదిరించి కారులో అత్యాచారం చేస్తున్న ఓ వ్యక్తిని తమిళనాడు పోలీసులు  మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. బాధితుల నుండి బంగారు ఆభరణాలను కూడ నిందితుడు చోరీ చేస్తున్నాడు


చెన్నై: రోడ్డుపై ఒంటరిగా వెళ్లే మహిళలను కత్తితో బెదిరించి కారులో అత్యాచారం చేస్తున్న ఓ వ్యక్తిని తమిళనాడు పోలీసులు  మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. బాధితుల నుండి బంగారు ఆభరణాలను కూడ నిందితుడు చోరీ చేస్తున్నాడు. పక్కా సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 

తమిళనాడు రాష్ట్రంలోని  చెన్నై, ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో ఒంటరిగా వెళ్లే మహిళలను  లక్ష్యంగా చేసుకొని  నిందితుడు అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై పోలీసులకు అందించిన సమాచారం మేరకు  పక్కా ప్లాన్ ప్రకారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే  ఓ 35 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేశారు. 

తనను కిడ్నాప్ చేసి  నిందితుడు అత్యాచారం చేసినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.నిందితుడు ఉపయోగించిన కారు నెంబర్ ను  బాధితురాలు పోలీసులకు అందించింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితుడిని సురేష్ గా గుర్తించారు. కారుడ్రైవర్‌గా పనిచేసే సురేష్ సుమారు 10 మందికి పైగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్టు  పోలీసులు గుర్తించారు. 

వివాహమైన స్త్రీలంటేనే తనకు ఇష్టమని  నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించారు.  ఒంటరిగా వెళ్లే వివాహిత మహిలతో మాటలు కలిపి వారిని కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడిననని నిందితుడు చెప్పాడు.  ఇప్పటివరకు  ఏ ఒక్కరూ కూడ ఈ విషయమై ఫిర్యాదు చేయలేదు. కానీ, ఓ బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు  పోలీసులు సురేష్ ను అరెస్ట్ చేశారు. 

ఈ వార్తలు చదవండి

ప్రియుడితో రాసలీలలు: భర్తను గొంతు కోసి చంపిన భార్య

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

అల్లుడితో అత్త అఫైర్: అడ్డు చెప్పిన కొడుకును చంపించిన తల్లి

loader