విజయవాడ:విజయవాడలోని కేఎల్‌రావు నగర్‌లో  రైల్వే బోగీల్లో  అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ బోగీలను   కొందరు తమ శృంగారానికి అనువుగా ఉపయోగించుకొంటున్నారు. పోలీసుల గస్తీ లేని కారణంగా రైల్వే బోగీలు ఈ కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయి.

వివిధ ప్రాంతాల నుండి కార్గో లోడ్‌లతో వచ్చిన గూడ్స్  బోగీలను కేఎల్ రావు వద్ద యార్డుకు తరలిస్తారు.  ఇక్కడ అన్‌లోడ్ చేస్తారు.  కార్గో లోడ్‌తో నింపేవరకు  బోగీలను ఇక్కడే ఉంచుతారు. 

ఈ యార్డులో రైల్వేట్రాక్‌కు సమీపంలోనే కూలీలకు విశ్రాంతి కోసం  షెడ్‌ను నిర్మించారు. అయితే సమీపంలోని బెల్ట్‌షాపుల నుండి మద్యం కొనుగుోలు చేసుకొని వచ్చిన కొందరు  ఈ ప్రాంతంలో తమ శృంగార కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. 

మద్యం అలవాటు ఉన్న మహిళలను ఇక్కడకు తీసుకొచ్చి  వాళ్ళకు మద్యం తాగించి ఆ తర్వాత వారితో తమ కామవాంఛ తీర్చుకొంటున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా  సాగిస్తున్నారు. దీంతో  ఆకతాయిల చర్యలతో  విశ్రాంతి తీసుకొనే కూలీలకు ఇబ్బందిగా మారుతోంది. ఆకతాయిలు మద్యం తాగి ఇక్కడ చేసే గలాటాతో  రైల్వే కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.

ఆర్పీఎఫ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే  ఈ పరిస్థితులు నెలకొంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రైల్వు బోగీల్లో అసాంఘిక చర్యలపై  చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.