చెన్నై: ప్రియుడి మోజులో కట్టుకొన్న భర్తను  హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. భర్తను చంపి మృతదేహాన్ని పొలంలో  పాతిపెట్టినట్టు  నిందితులు అంగీకరించారు. 

 తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు  గౌతమ్‌పేటకు చెందిన రాజ్‌కుమార్ , కౌసల్య భార్య,భర్తలు, వీరికి ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు.  రాజ్‌కుమార్  తిరుపత్తూరు్ బస్టాండ్‌లో  సైకిల్ షాపు నిర్వహిస్తున్నాడు.

ఈ నెల 11వ తేదీన  పెరియకులచ్చిలో  రాజ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది.ఈ ఘటనపై పోలీసుల విచారణలో  ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. రాజ్‌కుమార్ భార్య కౌసల్యకు అదే ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్  రమేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. 

రాజ్‌కుమార్ తాగుడుకు బానిసగా మారాడు. రాజ్ కుమార్ మద్యానికి బానిసగా మారడం కూడ  కౌసల్యకు కలిసొచ్చింది. దీంతో ఆమెకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.  రమేష్‌తో వివాహేతర సంబంధం విషయమై రాజ్ కుమార్ తన భార్య కౌసల్యను హెచ్చరించాడు. రమేష్‌తో వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని సూచించాడు.

అయినా కానీ  కౌసల్య మాత్రం రమేష్‌తో వివాహేతర సంబంధాన్ని మానుకోలేదు. తమ మధ్య బంధానికి భర్త రాజ్ కుమార్ అడ్డుగా ఉన్నాడని కౌసల్య భావించింది.దీంతో అతడిని చంపేయాలని ప్లాన్ చేసింది.  

రాజ్‌కుమార్ కు మద్యం తాగే అలవాటు ఉన్న కారణంగా ఈ నెల 11 వ తేదీన మద్యం తాగించి మత్తులోకి దిగిన తర్వాత రాజ్‌కుమార్ గొంతుకోసి  హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహన్ని పోలంలో వేశారు.  రాజ్ కుమార్ భార్య కౌసల్య, ఆమె ప్రియుడు రమేష్తోపాటు వీరికి సహకరించిన  తులసీరామన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

ఈ వార్త చదవండి

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి డ్రామా ఆడిన భార్య

అల్లుడితో అత్త అఫైర్: అడ్డు చెప్పిన కొడుకును చంపించిన తల్లి

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు