ఏలూరు: ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు.  కొంత కాలం బాగానే ఉన్నారు.  అయితే  వివాహేతర సంబంధం భార్య,భర్తల మధ్య చిచ్చు రేపింది.  ఈ విషయమై తరచూ గొడవలకు దిగేవారు. అయితే ఈ విషయమై పెద్దలు రాజీ కుదిర్చారు. నిద్రమాత్రలిచ్చి మరో వ్యక్తితో తన భార్య రాసలీలలకు పాల్పడుతోందనే నెపంతో రాంబాబు అనే వ్యక్తి తన భార్యను రోకలిబండతో కొట్టి చంపాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకొంది.

పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం పుప్పాలవారిగూడెం గ్రామానికి చెందిన  రాంబాబు,  నాగలక్ష్మి  9 ఏళ్ళ క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వీరికి ఓ ఇద్దరు కూతుళ్లు.   రాంబాబు ఓ హోటల్‌లో, నాగలక్ష్మి ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారు.  అయితే వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.ఈ విషయమై గత ఏడాది టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడ నమోదైంది.

అయితే భార్య, భర్తల మధ్య జరిగిన గొడవ విషయమై పెద్దలు రాజీ కుదిర్చారు.దీంతో రాంబాబు తన పిల్లలను తన తల్లి వద్ద ఉంచాడు.  సోమవారం నాడు భార్య నాగలక్ష్మితో మరోసారి రాంబాబు గొడవకు దిగాడు. రోకలిబండతో  కొట్టడంతో నాగలక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. మంగళవారం నాడు మధ్యాహ్నం పోలీసులకు లొంగిపోయాడు.

 కొంతకాలంగా  తన భార్య తనకు నిద్రమాత్రలు ఇస్తోందని నిందితుడు ఆరోపిస్తున్నాడు.ఈ మాత్రలు వేసుకొన్న తర్వాత తాను నిద్రలోకి జారుకోగానే మరో వ్యక్తితో తనభార్య వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోందని రాంబాబు పోలీసులకు చెప్పినట్టు సమాచారం.  సోమవారం నాడు కూడ  తాను ఈ మాత్రలను వేసుకొన్నట్టు నమ్మించి పడుకొన్నానని చెప్పాడు.

అయితే  తాను నిద్ర నుండి లేవగానే మరో వ్యక్తితో తన భార్య ఉందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తాను ఆగ్రహం పట్టలేక రోకలిబండతో కొట్టిచంపినట్టు సమాచారం.

ఈ విషయమై  ఘటనపై విచారణ చేపడుతున్నట్టు  జిల్లా అదనపు ఎస్పీ కె. ఈశ్వరరావు ప్రకటించారు.  ఈ హత్య ఘటనలో  రాంబాబుతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయమై కూడ దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

ఈ వార్తలు చదవండి

ప్రియుడితో రాసలీలలు: భర్తను గొంతు కోసి చంపిన భార్య

అల్లుడితో అత్త అఫైర్: అడ్డు చెప్పిన కొడుకును చంపించిన తల్లి

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు