తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌కు ప్రజలు షాకిచ్చారు. టీఆర్ఎస్‌కు ఏకపక్ష విజయాన్ని ఇవ్వకుండా కాంగ్రెస్, బీజేపీలకు కూడ తెలంగాణ ఓటర్లు పట్టం కట్టారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో కనీసం 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. హైద్రాబాద్‌లో ఎంఐఎం విజయం సాధిస్తోందని ఆ పార్టీ అంచనా వేసింది. టీఆర్ఎస్ అంచనాలను తలకిందులు చేస్తూ తెలంగాణ ఓటర్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను కూడ గెలిపించారు.