కొత్త సంవత్సరం తరువాత ఇప్పుడు అందరికీ గుర్తొచ్చేది సంక్రాంతి పండగ. ప్రతి ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ లో ఉండే నగరవాసులు ఉర్లళ్లో ఎక్కువ జరుపుకోవాటనికి ఇష్టపడతారు. కొందరు సొంత ఊరికి, కొందరు బంధువుల ఇంటికి ఎలా ఎవరి ప్రయాణాలను వారు నిర్ణయించుకుంటారు.

also read ఐటీ ఉద్యోగితో అసభ్య ప్రవర్తన... చొక్కొపట్టుకొని దులిపేసింది.

అయితే ప్రతిసారి లాగే ఈసారి కూడా ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ, గూడూరు మధ్య రెండు సువిధ రైళ్లతో పాటు మరో ప్రత్యేక రైలును కూడా నడపనున్నట్టు తెలిపింది.

ఈ నెల 9న విజయవాడ నుంచి సికింద్రాబాద్ మధ్య ఓ ప్రత్యేక రైలును నడపనుండగా 10వ తేదీన సికింద్రాబాద్ - గూడూరు మధ్య, 11న సికింద్రాబాద్- మచిలీపట్నం మధ్య ఈ రైళ్లు నడుస్తాయి. ఎప్పటిలాగానే ఈసారి కూడా సంక్రాంతి రద్దీకి అనుగుణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ - మచిలీపట్నం-గూడూరు మార్గాల్లో ఈ రైళ్లను అందుబాటులో ఉంచింది.

ఈ నెల 9న రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరే సంక్రాంతి స్పెషల్ రైలు 10న ఉదయం 6.45 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. దీనికి మధిర, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్ జంక్షన్, జనగామ స్టేషన్లలో  ఆగటనికి హాల్ట్ ఇచ్చారు.

also read కేసీఆర్ రైతు బంధుకు కోత... గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు

అలాగే11న రాత్రి 8.15కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరే సంక్రాంతి ప్రత్యేక సువిధ రైలు 12న ఉదయం 6.50 నిమిషాలకు గూడూరు చేరుకుంటుంది. దారి మధ్యలో జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు స్టేషన్లలో హాల్ట్ ఇచ్చారు.

11న రాత్రి 9.40కి సికింద్రాబాద్ నుంచి బయలేదేరే మరో సువిధ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా 12వ తేదీన ఉదయం 6.05 నిమిషాలకు మచిలీపట‌్నం చేరుకుంటుంది. ఈ మూడు ప్రత్యేక రైళ్లలోనూ ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ క్లాస్, సెకండ్ క్లాస్ సీట్లను అందుబాటులో ఉంచింది.