MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • IND vs WI: సంజూ శాంసన్ మాస్ ఇన్నింగ్స్.. సెమీస్‌లోకి టీమిండియా గ్రాండ్ ఎంట్రీ

IND vs WI: సంజూ శాంసన్ మాస్ ఇన్నింగ్స్.. సెమీస్‌లోకి టీమిండియా గ్రాండ్ ఎంట్రీ

India vs West Indies : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8లో వెస్టిండీస్‌పై 5 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 97 పరుగులతో చెలరేగిన సంజూ శాంసన్.. టీమిండియా సెమీఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 01 2026, 11:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సంజూ శాంసన్ వీరవిహారం.. సెమీస్‌కు చేరిన భారత్
Image Credit : Getty

సంజూ శాంసన్ వీరవిహారం.. సెమీస్‌కు చేరిన భారత్

కోల్‌కతాలో జరిగిన డూ ఆర్ డై పోరులో సంజూ శాంసన్ విశ్వరూపం చూపించాడు. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లీ పేరిట ఉన్న వరల్డ్ కప్ రికార్డును బద్దలు కొట్టిన సంజూ, టీమిండియాను దర్జాగా సెమీఫైనల్‌కు చేర్చాడు. కింగ్ లాంటి ఇన్నింగ్స్‌తో విండీస్‌ను దంచికొట్టి.. భారత్‌కు గ్రాండ్ విక్టరీ అందించాడు.

ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 గ్రూప్ 1 పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, సంజూ శాంసన్ (97 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్ సాయంతో 19.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్ అధికారికంగా సెమీఫైనల్‌కు చేరుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వెస్టిండీస్ భారీ స్కోరు: హోల్డర్, పొవెల్ మెరుపులు
Image Credit : Getty

వెస్టిండీస్ భారీ స్కోరు: హోల్డర్, పొవెల్ మెరుపులు

మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టుకు ఓపెనర్లు షాయ్ హోప్ (32), రోస్టన్ చేజ్ (40) మంచి పునాది వేశారు. మధ్యలో షిమ్రాన్ హెట్మెయర్ 12 బంతుల్లోనే 27 పరుగులు చేసి స్కోరు వేగాన్ని పెంచాడు. అయితే, భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి విండీస్‌ను కట్టడి చేశాడు. చివర్లో జేసన్ హోల్డర్ (37 నాటౌట్), రోవ్‌మన్ పొవెల్ (34 నాటౌట్) చెలరేగడంతో వెస్టిండీస్ 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా తలో వికెట్ సాధించారు.

Related Articles

Related image1
IND vs WI: గంభీర్ మైండ్ గేమ్.. సామీ మాస్టర్ ప్లాన్ ! అద్భుతానికి అడుగు దూరంలో భారత్
Related image2
IND vs WI : అభిషేక్ శర్మ కొంపముంచాడుగా! వరుస క్యాచ్ డ్రాప్‌లతో భారత్‌కు చుక్కలు చూపించిన విండీస్
35
లక్ష్య ఛేదనలో తడబడ్డ ఓపెనర్లు.. ఆదుకున్న శాంసన్
Image Credit : Getty

లక్ష్య ఛేదనలో తడబడ్డ ఓపెనర్లు.. ఆదుకున్న శాంసన్

196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (18) కూడా నిరాశపరిచాడు. ఈ దశలో క్రీజులో ఉన్న సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అతనికి యువ ఆటగాడు తిలక్ వర్మ (27) చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను భారత వైపు తిప్పారు.

45
కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన సంజూ సంజూ
Image Credit : Getty

కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన సంజూ సంజూ

శాంసన్ కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ రన్ ఛేజింగ్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సంజూ చరిత్ర సృష్టించాడు. గతంలో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న 82 పరుగుల రికార్డును శాంసన్ అధిగమించాడు. తిలక్ వర్మ అవుటైన తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా (17) కూడా కొన్ని మెరుపులు మెరిపించాడు. చివరి ఓవర్లలో ఒత్తిడిని అధిగమిస్తూ సంజూ శాంసన్ ఫోర్లు, సిక్సర్లతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.

55
సెమీస్‌కు గ్రాండ్ ఎంట్రీ.. అభిమానుల సంబరాలు
Image Credit : X@BCCI

సెమీస్‌కు గ్రాండ్ ఎంట్రీ.. అభిమానుల సంబరాలు

చివరి ఓవర్ లో 7 పరుగులు కావాల్సిన దశలో సంజూ శాంసన్ మొదటి బంతికే సిక్స్ కొట్టి స్కోర్లు సమం చేయగా, రెండో బంతికి ఫోర్ కొట్టి భారత్‌ను గెలిపించాడు. ఈ విజయంతో ఈడెన్ గార్డెన్స్ స్టేడియం హోరెత్తిపోయింది. భారత జట్టు కలిసికట్టుగా రాణించడం, ముఖ్యంగా సంజూ శాంసన్ క్లాస్ ఇన్నింగ్స్ టీమిండియాను సెమీఫైనల్‌కు చేర్చాయి. వెస్టిండీస్ బౌలర్లలో షమర్ జోసెఫ్ 2 వికెట్లు, జేసన్ హోల్డర్ 2 వికెట్లు తీసినప్పటికీ భారత విజయాన్ని అడ్డుకోలేకపోయారు. భారత తన తర్వాతి మ్యాచ్ సెమీస్ లో ఇంగ్లాండ్ తో ఆడనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image2
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Recommended image3
AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం
Related Stories
Recommended image1
IND vs WI: గంభీర్ మైండ్ గేమ్.. సామీ మాస్టర్ ప్లాన్ ! అద్భుతానికి అడుగు దూరంలో భారత్
Recommended image2
IND vs WI : అభిషేక్ శర్మ కొంపముంచాడుగా! వరుస క్యాచ్ డ్రాప్‌లతో భారత్‌కు చుక్కలు చూపించిన విండీస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved