ఆత్మరక్షణలో టీఆర్ఎస్: కేసీఆర్ అంతర్మధనం

First Published 27, May 2019, 3:58 PM IST

 పార్లమెంట్ ఎన్నికల్లో  అనుకొన్న మేర ఫలితాలు రాకపోవడంతో  టీఆర్ఎస్ అంతర్మధనంలో పడింది. బలమైన స్థానాల్లో  ప్రత్యర్థులు విజయం సాధించడం పట్ల టీఆర్ఎస్ నాయకత్వం ఆత్మరక్షణలో పడింది. దీంతో  పార్టీపై కేసీఆర్ కేంద్రీకరించారు. భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
 
తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ 9 స్థానాలను మాత్రమే గెలుచుకొంది. నాలుగు స్థానాల్లో బీజేపీ, మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక్క స్థానంలో ఎంఐఎం విజయం సాధించింది.

ఎంఐఎం విజయాన్ని ముందే ఊహించినప్పటికీ... బీజేపీ, కాంగ్రెస్ విజయాలను టీఆర్ఎస్ ఊహించలేదు. ఈ పరిణామం టీఆర్ఎస్‌ను ఆత్మరక్షణలో పడేసింది. టీఆర్ఎస్‌కు ఉత్తర తెలంగాణలో మంచి పట్టుంది. ఉత్తర తెలంగాణకు కేంద్రంగా ఉన్న కరీంనగర్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చేతిలో ఓటమి పాలయ్యాడు.

నిజామాబాద్ ఎంపీ స్థానంలో కేసీఆర్ కూతురు కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలైంది. సికింద్రాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ యాదవ్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ నగేష్ బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు చేతిలో ఓడిపోయాడు.

మెదక్ ఎంపీ స్థానంలో కొత్త ప్రభాకర్ రెడ్డి మూడు లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. మెదక్ కంటే రెండు ఓట్లు ఎక్కువ తెచ్చుకొంటామని చెప్పిన కరీంనగర్ నేతలు.... ఈ స్థానాన్ని బీజేపీకి అప్పగించారు.

ఇక నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి రెండు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు విజయం సాధించారు. మల్కాజిగిరి నుండి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నెగ్గారు.

ఈ పరిణామాల నేపథ్యంలో రెండు రోజుల క్రితం పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. కొత్తగా ఎంపీలుగా ఎన్నికైన వారిని కేసీఆర్ అభినందించారు. పార్లమెంట్ ఫలితాలపై కేసీఆర్ సమీక్షించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు... ఎమ్మెల్యేలు సరిగా పనిచేయలేదని కేసీఆర్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

ఎంపీలను గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. కానీ.. ఆయా జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలు ఎంపీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోలేదని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

అన్ని స్థానాల్లో  తాము విజయం సాధిస్తామనే ధీమా ఉండడం కూడ టీఆర్ఎస్ కొంప ముంచిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు వెలువడిన రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ప్రజలు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ఈ ఫలితాలను చూసైనా టీఆర్ఎస్ నాయకత్వం ముందు జాగ్రత్తలు తీసుకోలేదు.

అయితే గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగిన అభ్యర్థులు తమ పార్టీకి చెందిన వారు కాదని అందుకే ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోలేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

రెండో దఫా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత  హరీష్‌ను పక్కకు పెట్టడం....కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించడం వంటి పరిణామాలు కూడ కొంత ఆ పార్టీకి నష్టం చేసినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

అదే సమయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ను నియమించడం.... మంత్రివర్గ విస్తరణలో హరీష్‌కు చోటు కల్పించకపోవడం వంటి పరిణామాలు కూడ టీఆర్ఎస్ వర్గాల్లో ప్రభావాన్ని చూపినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ విస్తరణ చేసే అవకాశం లేకపోలేదు. హరీష్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందంటున్నారు. హరీష్ తో పాటు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డిలకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.త్వరలోనే  పార్టీలో కూడ మార్పులు చేర్పులు చేసే అవకాశం లేకపోలేదని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

loader