పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఓటమిపై స్పందించారు టీ. కాంగ్రెస్ నేత విజయశాంతి. దేశ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని... అయితే ఎన్డీయేకు అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పు సరైందో, కాదో కాలమే నిర్ణయిస్తుందన్నారు.

పార్టీలకు అతీతంగా గెలుపొందిన విజేతలను ఆమె అభినందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలనిచ్చినందుకు విజయశాంతి ధన్యవాదాలు తెలిపారు. కాగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు షాకిస్తూ.. కాంగ్రెస్ పార్టీ మూడు లోక్‌సభ స్ధానాలను కైవసం చేసుకుంది.

నల్గొండ, మల్కాజ్‌గిరి, భువనగిరిలో పాగా వేసింది. చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి చివరి నిమిషంలో ఓటమి పాలయ్యారు.