పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన ప్రధాని నరేంద్రమోడీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాజా ఎన్నికల్లో నూరు కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు.

తెలంగాణ ప్రజలు మరోసారి టీఆర్ఎస్‌కు మెజారిటీ స్థానాలు  కట్టబెట్టారని కేటీఆర్ తెలిపారు. మెరుగైన స్థానాలు రావాలని ఎంతో కష్టపడ్డామని.. అయితే ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధార్యమని కేటీఆర్ స్పష్టం చేశారు.

వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్‌లకు ఇప్పటికే  కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపొటములు సహజమని.. చంద్రబాబును కించపరిచేలా మాట్లాడనని కేటీఆర్ తెలిపారు. తమకు ఏ పార్టీతోనూ వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.