Asianet News Telugu

ధావన్ మళ్లీ వస్తాడు: మరిన్ని వార్తలు

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం
 

Top Stories of the day
Author
Hyderabad, First Published Jun 14, 2019, 6:25 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నిన్న జగన్.. నేడు సోము: టీడీపీ నేతలు టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యలు

ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఫైరయ్యారు. అమరావతిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. 
 

నాగార్జున రొమాన్స్ కి సింగర్ చిన్మయి బలైంది!

సెలబ్రిటీలు ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే నెటిజన్లు వారిని ట్రోల్ చేయడం ఖాయం. గతంలో సమంత '1 నేనొక్కడినే' సినిమాలో మహేష్ బాబు కాలి దగ్గర హీరోయిన్ ఉందని మండిపడింది. 

 

జగన్ వ్యూహం: చంద్రబాబుపై ఎదురుదాడి, ఫిరాయింపుల

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా వ్యూహంతో ఎదురుదాడికి దిగుతున్నట్లు కనిపిస్తున్నారు. శాసనసభ సమావేశాల తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. చంద్రబాబును ఆత్మరక్షణలో పడేయానికి ఆయన ఎదురుదాడి వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

 

షాక్: చంద్రబాబుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆయనపై రిపబ్లిక్‌ పార్టీ అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్‌కుమార్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 

 

ఇలాంటి చీప్ వీడియోలు చేస్తావా..? విశాల్ పై మండిపడ్డ వరలక్ష్మీ!

మరోసారి ఎన్నికల హడావిడి మొదలవ్వడంతో విశాల్ అండ్ టీం శరత్ కుమార్, రాధారవిలపై ఆరోపణలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇది చూసిన వరలక్ష్మి  ఆగ్రహంతో ఊగిపోయింది. విశాల్ పై కోపాన్ని ఓ లేఖ రూపంలో రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
 

జగన్ పై దాడి కేసు: శ్రీనివాస్ బెయిల్ రద్దు చేయాలని ఎన్ఐఎ పిటిషన్

ప్రస్తుత ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో ఎన్ఐఎ కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ పై దాడి కేసులో నిందితుడైన శ్రీనివాస్ కు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎన్ఐఎ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

 

కారణాలు తెలియడం లేదు: ఓటమిపై చంద్రబాబు

ఈ ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలయ్యామో కారణాలు తెలియడం లేదని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. గతంలో మాత్రం ఇలా లేదన్నారు.

 

చెవిరెడ్డి బంట్రోతు వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందన ఇదీ...

అధికారంలో ఉన్నా,ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాప్రతినిధులు ప్రజలకు బంట్రోతులేనని బాలకృష్ణ స్పస్టం చేశారు. అందరూ ప్రజలకు సేవ చేయాల్సిందేనని ఆయన అన్నారు.

 

బీజేపీ ఏపీ ప్లాన్: టీడీపీ ఎంపీలకు గాలం, చర్చలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీని మరింత దెబ్బతీసేందుకు కాషాయదళం ప్రయత్నాలను ప్రారంభించింది. పార్లమెంట్ ఉభయ సభల్లోని టీడీపీ ఎంపీలపై బీజేపీ గాలం వేస్తోంది.టీడీపీకి చెందిన ఎంపీలను తమ పార్టీలో చేర్చుకొంటే రాజ్యసభలో బలాన్ని పెంచుకొనేలా కమలదళం ప్లాన్ చేస్తోంది.

 

ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు షాకైన శ్రద్ధా కపూర్.. వీడియో వైరల్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహోపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. గురువారం విడుదలైన టీజర్ సినిమాపై మరింతగా ఉత్కంఠని పెంచేసింది.

 

టాస్ గెలిచి వర్షాన్ని ఎంచుకున్న వెదర్.. వరల్డ్ కప్ వర్షాలపై మీమ్స్

గురువారం జరగాల్సిన భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దవడ్డంతో వరుణిడిపై అభిమానుల కోపం కట్టలు తెచ్చుకుంటోంది. వరల్డ్ కప్ లో వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్ లలో ఇది నాలుగవది. నెటిజన్స్ తెలివిని ఉపయోగించి మీమ్స్ తో సెటైరికల్ కొటేషన్స్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నారు. 

 

 

అసెంబ్లీ ఆవరణలో నారా లోకేష్ సందడి: కరచాలనాలు, పలకరింపులు

శాసనసభ ఆవరణలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ సందడి చేశారు. మంత్రులతో, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలతో కరచాలనం చేశారు. వారిని ఆత్మీయంగా పలకరించారు.
 

మహారాష్ట్రకు వెళ్లు: వరుణదేవుడికి కేదార్ జాదవ్ ప్రార్థనలు

ఆట చూడడానికి వచ్చినవారంతా  గొడుగులు పట్టుకుని నిలబడ్డారు. వానదేవుడు కరుణించి ఆట ప్రారంభమవుతుందేమోనని ఆశగా వేచి చూశాడు. అయితే, వారికి నిరాశ తప్పలేదు. ఈ స్థితిలో కేదార్ జాదవ్ పెట్టిన ఓ పోస్టు వైరల్ అవుతోంది.
 

 

జగన్ ప్రకటన కేసీఆర్ కు చెంపపెట్టు: విజయశాంతి

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి నిప్పులు చెరిగారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించారు. 

 

యాచించం: భారత్ తో క్రికెట్ పై పీసీబీ చీఫ్ సంచలనం

ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా దాయాదాలు పాకిస్తాన్, ఇండియా ఆదివారం తలపడబోతున్న స్థితిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబి) చీఫ్ ఎహసాన్ మని సంచలన ప్రకటన చేశారు. తమతో క్రికెట్ ఆడాలని తాము ఇండియాను యాచంచబోమని ఆయన చెప్పారు. 

 

'గేమ్' ఛేంజర్ కానీ...(‘గేమ్‌ ఓవర్’ మూవీ రివ్యూ)

తెలుగులో కమర్షియల్ సినిమాలు చేస్తూ కెరీర్ మొదలెట్టిన తాప్సీ బాలీవుడ్ కు వెళ్లి తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకుంది. విభిన్నమైన కథాంశాలతో ఎంచుకుంటున్న ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రయారిటీ ఇస్తోంది. తాజాగా గేమ్ ఓవర్ అంటూ ఓ కొత్త థ్రిల్లర్ తో మన ముందుకు వచ్చింది.

 

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్


కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డికి గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ విషయమై కిషన్ రెడ్డి  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

ప్రపంచ కప్2019: జిమ్ లో కసరత్తులు మొదలుపెట్టిన ధవన్ (వీడియో)

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ శిఖర్ ధవన్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయంతో బాధపడుతూనే అతడు తాజాగా జిమ్ లో కసరత్తులు మొదలుపెట్టాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను  కూడా అవకాశంగా మలుచుకుని ముందుకు సాగాలని ధవన్ సూచించాడు. 

 

 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios