Asianet News TeluguAsianet News Telugu

నాగార్జున రొమాన్స్ కి సింగర్ చిన్మయి బలైంది!

సెలబ్రిటీలు ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే నెటిజన్లు వారిని ట్రోల్ చేయడం ఖాయం.

trolling on singer chinmayi
Author
Hyderabad, First Published Jun 14, 2019, 3:44 PM IST

సెలబ్రిటీలు ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే నెటిజన్లు వారిని ట్రోల్ చేయడం ఖాయం. గతంలో సమంత '1 నేనొక్కడినే' సినిమాలో మహేష్ బాబు కాలి దగ్గర హీరోయిన్ ఉందని మండిపడింది. 

అమ్మాయిలను తక్కువగా చూస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అదే సమంత 'మజిలీ' సినిమాలో ఒక పాటలో నాగచైతన్య కాలికి దణ్ణం పెట్టి కళ్లకు అద్దుకుంటుంది. దీంతో నెటిజన్లు సమంతని టార్గెట్ చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితినే సింగర్ చిన్మయి ఎదుర్కొంటోంది.

సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి.. ఈ ఏడాది జనవరిలో ''వయసు మళ్లిన హీరోలు తమ సినిమాలలో కూతురు వయసుండే హీరోయిన్లతో రొమాన్స్ చేయడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోజరుగుతూనే ఉంది. ఇది ఇంకా ఆగలేదు.. ఆగిందా..?'' అంటూ ఓ  పోస్ట్ పెట్టింది.

ఇది ఇలా ఉండగా.. చిన్మయి ఇప్పుడు తన భర్త రాహుల్ రవీంద్రన్ రూపొందించిన 'మన్మథుడు 2' చిత్రాన్ని ప్రమోట్ చేస్తోంది. ఇందులో హీరోగా నటించిన నాగార్జున వయసు 59.. తన వయసులో సగం కంటే తక్కువ ఉన్న హీరోయిన్లతో రొమాన్స్చేస్తున్నారు.

దీంతో నెటిజన్లు చిన్మయిని టార్గెట్ చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం అప్పట్లో పోస్ట్ లు పెట్టి ఇప్పుడు తన భర్త అలాంటి పనులు చేస్తుంటే ప్రోత్సహిస్తుందని ఆమెని ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి చీప్ పబ్లిసిటీ కోసం వెంపర్లాడడం సిగ్గుగా లేదా..? అంటూ ఓ రేంజ్ లో చిన్మయిపై విమర్శలు చేస్తున్నారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios