అమరావతి: శాసనసభ ఆవరణలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ సందడి చేశారు. మంత్రులతో, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలతో కరచాలనం చేశారు. వారిని ఆత్మీయంగా పలకరించారు.
 
డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఆనం రాంనారాయణరెడ్డిలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజును నమస్తే అంటూ ఆయన పలకరించారు.

శుక్రవారంనాడు గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నారా లోకేష్ సభకు వచ్చారు. ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.