Asianet News TeluguAsianet News Telugu

జగన్ ప్రకటన కేసీఆర్ కు చెంపపెట్టు: విజయశాంతి

పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన వై‌ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పీకర్‌ను ఎన్నుకొని ఆయన పదవిలో కూర్చున్న వెంటనే అధికారపక్షం తరఫున కీలకమైన ఒక తీర్మానం చేయడం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆమె అన్నారు.

Vijayashanthi deplores KCR attitude
Author
Hyderabad, First Published Jun 14, 2019, 11:56 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి నిప్పులు చెరిగారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించారు.  రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే వింతగా అనిపిస్తోందని ఆమె అన్నారు.

బంగారు తెలంగాణ పేరుతో దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటామని చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆమె గుర్తు చేశారు. అయినా టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం స్పీకర్‌ను అడ్డం పెట్టుకుని పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిన తీరుపై చివరకు కోర్టు కూడా నోటీసులు జారీ చేసిందని ఆమె ్న్నారు. దీన్నిబట్టి పరిస్థితి ఎంత దిగజారిందో అర్ధమవుతోందని ఆమె అన్నారు
 
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన వై‌ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పీకర్‌ను ఎన్నుకొని ఆయన పదవిలో కూర్చున్న వెంటనే అధికారపక్షం తరఫున కీలకమైన ఒక తీర్మానం చేయడం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆమె అన్నారు.
 
పార్టీ ఫిరాయింపులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించే ప్రసక్తే లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి రావాలని జగన్ చెప్పారని, అది తెలంగాణలో అధికారపక్షం చేస్తున్న అరాచకాలకు చెంపపెట్టులాంటిదని విజయశాంతి ఆమె అన్నారు. 

తనను చూసి దేశంలోని మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాఠాలు నేర్చుకోవాలని డైలాగులు కేసీఆర్ డైలాగులు చెప్పారని, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాళ్లకు చక్రాలు కట్టుకుని కేసీఆర్ తిరిగారని, ఏపీలో జరిగే పరిణామాల మీద కేసీఆర్ ఏ రకంగా స్పందిస్తారంటూ తెలంగాణ ప్రజలంతా వేచి చూస్తున్నారని ఆమె అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios