గుంటూరు: ఈ ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలయ్యామో కారణాలు తెలియడం లేదని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. గతంలో మాత్రం ఇలా లేదన్నారు.

శుక్రవారం నాడు గుంటూరులో టీడీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు హాజరయ్యారు.ఈ సమావేశంలో  ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై టీడీపీ నాయకత్వం సమీక్ష నిర్వహించనున్నారు.

గతంలో  ఓటమికి కారణాలు స్పష్టంగా తెలిసేవని చంద్రబాబునాయుడు చెప్పారు. టీడీపీ ఓటమి పాలైన 3 వారాల్లో రాష్ట్రంలోని 100 చోట్ల దాడులు చోటు చేసుకొన్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. గ్రామ స్థాయిలో కార్యకర్తలకు నేతలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

రాష్ట్రంలో టీడీపీ ఐదు సార్లు విజయం సాధించినా ఏనాడూ కూడ ప్రత్యర్థులపై దాడులు చేయలేదన్నారు. కానీ, ప్రత్యర్థులు విజయం సాధించినప్పుడల్లా తమ పార్టీపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు గుర్తు చేశారు.