విజయవాడ: ప్రస్తుత ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో ఎన్ఐఎ కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ పై దాడి కేసులో నిందితుడైన శ్రీనివాస్ కు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎన్ఐఎ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

శ్రీనివాస్ కు ఇటీవల ఎన్ఐఎ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దాంతో అతను జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే, అతని బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఎన్ఐఎ తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్రిమినల్ బెయిల్ పై బయట ఉంటే నష్టమని లాయర్ వాదించారు.