ఫైనల్ గా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షమే గెలిచి కప్ ను వరదల్లో తీసుకుపోవడం పక్కా అంటూ అభిమానులు మీమ్స్ తో షాకిస్తున్నారు. పాయింట్స్ పట్టికలో కూడా వర్షాన్నీ చేర్చి 6 పాయింట్లు ఇస్తుండడం వైరల్ అవుతోంది. 

గురువారం జరగాల్సిన భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దవడ్డంతో వరుణిడిపై అభిమానుల కోపం కట్టలు తెచ్చుకుంటోంది. వరల్డ్ కప్ లో వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్ లలో ఇది నాలుగవది. నెటిజన్స్ తెలివిని ఉపయోగించి మీమ్స్ తో సెటైరికల్ కొటేషన్స్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నారు. 

టాస్ గెలిచి స్విమ్మింగ్ ఎంచుకున్న భరత్.. భారత జట్టు అండర్ వాటర్ లో కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేయాల్సిందే.. ఇక ఈ వరల్డ్ కప్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను నీటిని ఎత్తిపోసిన సిబ్బందికి ఇవ్వాలని కామెంట్ చేస్తున్నారు.