అమెరికాతో అణు ఆయుధాల గురించి మాట్లాడటానికి ఇరాన్ ఒప్పుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీన్ని కన్ఫర్మ్ చేశారు, త్వరలోనే చర్చలు మొదలవుతాయి.
పూర్తి కథనం చదవండిTelugu news live updates: ఒంటరిగా మిగిలిన ఇరాన్... అమెరికాకు లొంగిపోయిందా?

ఇరాన్‌తో న్యూక్లియర్ ఒప్పందం కుదరకపోతే అది ఆ దేశానికి చాలా నష్టమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గాజాను ధ్వంసం చేస్తున్నట్లు ఇజ్రాయల్ సైన్యం ప్రకటించింది. ఇక దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసుపై ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. HCU విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అహ్మదాబాద్‌కు వెళ్లనున్నారు. ఏఐసీసీ సమావేశం కోసం సీఎం వెళ్తున్నారు. ఇక నేడు సత్యసాయి జిల్లాలలో జగన్ పర్యటించనున్నారు. వీటితో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..
ఒంటరిగా మిగిలిన ఇరాన్... అమెరికాకు లొంగిపోయిందా?
Waqf Amendment Act : నేటినుండే వక్ఫ్ చట్టం అమలు... కేంద్రం నోటిఫికేషన్ జారీ
రాజకీయంగా, చట్టపరంగా పెద్ద చర్చలు జరుగుతున్న టైంలో వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 ఏప్రిల్ 8 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తుల రికార్డులన్నీ డిజిటల్‌లో భద్రపరచాలి. వక్ఫ్ ఆస్తుల వివాదాల పరిష్కారానికి టైమ్ లైన్ కూడా ఫిక్స్ చేశారు.
పూర్తి కథనం చదవండిInstagram: టీనేజర్లకు ఇన్‌స్టాగ్రామ్ షాక్: తల్లిదండ్రుల అనుమతి ఉండాల్సిందే..
Instagram: ఇన్‌స్టాగ్రామ్ తీసుకువచ్చిన కొత్త మార్పుల ప్రకారం.. 16 ఏళ్లలోపు టీనేజర్లు తల్లిదండ్రులు అనుమతి ఇవ్వకపోతే ఇన్‌స్టాగ్రామ్ లైవ్ స్ట్రీమ్ సర్వీసును ఉపయోగించుకోవడానికి అనుమతి ఉండదు. డైరెక్ట్ మెసేజ్‌లలో అనుమానిత నగ్నత్వం ఉన్న చిత్రాలను బ్లర్ చేసే మా ఫీచర్‌ను ఆఫ్ చేయడానికి కూడా వారికి అనుమతి అవసరమని మెటా బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. అలాగే, మెటా తన ఫేస్‌బుక్, మెసెంజర్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా టీనేజ్ అకౌంట్ల విషయంలో సెక్యూరిటీని మరింత విస్తరిస్తున్నట్టు తెలిపింది.
బి అలర్ట్: ఏప్రిల్ 10లోపు ఇలా చేయలేదో ఈ బ్యాంక్ అకౌంట్ క్లోజ్!
మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? ఇంకా KYC సమర్పించలేదా? RBI మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 10వ తేదీలోగా కేవైసి సమర్పించకపోతే ఖాతాలు మూసివేయబడవచ్చు. కాబట్టి వెంటనే సంబంధిత పత్రాలను తీసుకెళ్లి కేవైసి సమర్పించండి.
పూర్తి కథనం చదవండిLSG vs KKR : సెహ్వాగ్, గేల్ రికార్డులు బద్దలు కొట్టిన నికోలస్ పూరన్
IPL LSG vs KKR: ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ సూపర్ ఇన్నింగ్స్ లతో అదరగొడుతున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ పై అద్భుతమైన బ్యాటింగ్ తో అజేయ హాఫ్ సెంచరీ సాధించాడు. కోల్ కతా అడ్డాలో లక్నో టీమ్ కు సూపర్ విక్టరీ అందించాడు. ఈ క్రమంలోనే రికార్డుల మోత మోగించాడు.
Mark Shankar : ఆ కార్మికులే లేకపోతే ... పవన్ కల్యాణ్ కొడుకు పరిస్థితి ఏమయ్యేదో..!
ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పెద్దకొడుకు అకీరా నందన్ పుట్టినరోజునేే చిన్నకొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్ లో ఓ సమ్మర్ క్యాంప్ మార్క్ శంకర్ ఉండగా అగ్నిప్రమాదం జరిగింది... దీంతో ఇతడు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యాడు. పవన్ తో పాటు చిరంజీవి దంపతులు సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తన కొడుకుతో పాటు మిగతా పిల్లలను కాపాడింది ఎవరో పవన్ వెల్లడించారు. వారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పూర్తి కథనం చదవండిPriyansh Arya: 6 6 6 6 6 6.. ఊచకోత.. ప్రియాంష్ ఆర్య సెంచరీ విధ్వంసం
Priyansh Arya: పంజాబ్ కింగ్స్ యంగ్ ప్లేయర్ ప్రియాంష్ ఆర్య సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. మథీషా పతిరానా బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్సర్లతో వరుసగా 6,6,6,4 బాది 23 పరుగులు రాబట్టాడు. 39 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ నాల్గో సెంచరీ కావడం విశేషం. అతని కంటే ముందు గేల్ (30), యూసుఫ్ పఠాన్ (37), మిల్లర్ (38) మాత్రమే ఐపీఎల్లో వేగవంతమైన సెంచరీలు సాధించారు. అలాగే, ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన రెండో భారతీయుడిగా ప్రియాంష్ ఆర్య నిలిచాడు.
పూర్తి కథనం చదవండివైద్యరంగంలో ఏఐ విప్లవం ... ఇక మానవ ప్రమేయం లేకుండానే రోగ నిర్దారణ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ ఎంటరై అద్భుతాలు చేస్తోంది. ఇప్పటికే వైద్యరంగంలో ఏఐ ప్రవేశించింది... తాజాగా ఈ టెక్నాలజీని ఉపయోగించిన హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ సరికొత్త పరిశోధన చేసింది. ఇలా ఏఐ సాయంతో కిమ్స్ వైద్యులు చేసిన పరిశోధన ఏమిటి? దీని ఫలితం ఎలా ఉంది? భవిష్యత్ వైద్యశాస్త్రంలో ఏఐ గేమ్ ఛేంజర్ గా ఎలా మారుతుంది? ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిIPL LSG vs KKR: వాటే మ్యాచ్.. పరుగుల సునామీలో కేకేఆర్ పై లక్నో థ్రిల్లింగ్ విక్టరీ
IPL LSG vs KKR: నికోలస్ పూరన్ క్రీజులో ఉంటే పూనకాలే అనేలా మరోసారి సూపర్ నాక్ అడాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ 4 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. రెండు టీమ్స్ అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగుల వర్షం కురిపించాయి. దీంతో ఐపీఎల్ 2025లో భారీ స్కోర్ మ్యాచ్ గా నిలిచింది.
Nicholas Pooran: ఇదేం కొట్టుడు సామీ.. నికోలస్ పూరన్ దెబ్బకు స్టేడియం అదిరిపోయింది
KKR vs LSG IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ పరుగుల సునామీ రేపుతున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ 2025లో 5 మ్యాచ్ లు ఆడిన నికోలస్ పూరన్ 288 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో టాప్ స్కోరర్ గా ఆరెంజ్ క్యాప్ ను తనవద్ద ఉంచుకున్నాడు. పూరన్ ఇప్పటివరకు మూడు హాఫ్ సంచరీలు సాధించాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 87 పరుగులు నాటౌట్.
పూర్తి కథనం చదవండిUSA: అమెరికాలో అరాచకం.. భారతీయ మహిళా పారిశ్రామికవేత్తకు వేధింపులు, 8 గంటల నిర్బంధం. అసలేం జరిగిందంటే..
భారతీయ పారిశ్రామికవేత్త శృతి చతుర్వేదిని అమెరికా విమానాశ్రయంలో 8 గంటలపాటు నిర్బంధించి అవమానించారు. పవర్ బ్యాంక్ సాకుతో ఎఫ్‌బీఐ అధికారులు వేధించారని ఆరోపించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
పూర్తి కథనం చదవండిశుభకార్యాల్లో రూ.116 ఎందుకు చదివిస్తారు? ఈ సాంప్రదాయం వెనక ఆసక్తికర స్టోరీ
మనం బందువులు, స్నేహితులు లేదా తెలిసినవారి ఇంట శుభకార్యానికి వెళ్ళినప్పుడు డబ్బులు చదివిస్తుంటాం. అయితే రూ.100, 500, 1000 ఇలా కాకుండా రూ.116, 516, 1116 చదివిస్తాం. ఇలా ఎందుకు చేస్తామో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రూ.116 సాంప్రదాయం ఎప్పుడు మొదలయ్యింది? ఎందుకు మొదలయ్యింది? అనేది ఇక్కడ తెలుసుకుందాం. దీని వెనక ఆసక్తికర స్టోరీ ఉంది.
పూర్తి కథనం చదవండిpawan kalyan: పవన్ కొడుకు కోలుకోవాలని జగన్, రోజా ట్వీట్లు.. షాక్‌లో క్యాడర్.. అంటే మీరు మీరు!
pawan kalyan vs ys jagan: సింగపూర్‌లోని ఇంటర్నేషనల్ స్కూల్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో అక్కడ చదువుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ ప్రత్యేక విమానంలో వైజాగ్ నుంచి సింగపూర్ బయలుదేరారు. ఈ నేపథ్యంలో పవన్ కుమారుడు కోలుకోవాలని సామాజిక మాధ్యమాల్లో ప్రముఖులు, రాజకీయ నేతలు కోరుకుంటున్నారు. అయితే పవన్ పేరు ఎత్తగానే ఉవ్వెత్తున ఎగసిపడే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి రోజా, ఇతర వైసీపీ నేతలు పవన్ కుమారుడు కోలుకోవాలని సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. అవి చూసిన క్యాడర్ ఏమనుకుంటుందంటే...
పూర్తి కథనం చదవండిLSG vs KKR: కేకేఆర్ ను దంచికొట్టారు భయ్యా
KKR vs LSG IPL 2025: ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 238/3 పరుగులతో ఐపీఎల్ లో తమ రెండో అత్యధిక స్కోర్ ను నమోదుచేసింది. ఈ మ్యాచ్ లో మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్ లు అద్భుతమైన బ్యాటింగ్ లో పరుగుల వరద పారించారు. వరుస పెట్టి ఫోర్లు, సిక్సర్లు బాదారు. దీంతో లక్నో టీమ్ కేకేఆర్ ముందు 239 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది.
Indoor Plants: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే ఏసీల అవసరమే ఉండదు
Indoor Plants: వేసవికాలం ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ టైంలో నిరంతరం ఏసీలు పనిచేస్తుంటే కరెంట్ బిల్లు రూ.వేలల్లో వస్తుంది. అలాకాకుండా మీ ఇంట్లో ఈ మొక్కలు పెంచుకుంటే ఆటోమేటిక్ గా మీ ఇల్లు చల్లగా ఉంటుంది. ప్రత్యేకమైన ఆ మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిWhatsApp: వాట్సాప్‌లో మీరు పంపిన ఫొటోలు.. ఇతరుల ఫోన్‌లలో సేవ్ కావు. కొత్త ఫీచర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకురావడంలో ముందు వరుసలో ఉంటుంది వాట్సాప్. ముఖ్యంగా యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇంతకీ ఏంటీ ఫీచర్.? దీని ఉపయోగం ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
IPL 2025: ఐపీఎల్ లో భువనేశ్వర్ కుమార్ సూపర్ రికార్డు
Bhuvneshwar Kumar: ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలర్ భువనేశ్వర్ కుమార్ కీలకమైన సమయంలో తిలక్ వర్మ వికెట్ ను తీసుకుని మ్యాచ్ ను మలుపు తిప్పాడు. అలాగే, డ్వేన్ బ్రాబో, లసిత్ మలింగ్ రికార్డులను బద్దలు కొట్టి ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు.
Airport Jobs : నెలకు రూ.1,40,000 సాలరీలో ఎయిర్పోర్ట్ జాబ్స్ ... ప్రైవేట్ కాదు ప్రభుత్వ ఉద్యోగాలే
లక్షల సాలరీతో ఎయిర్పోర్ట్ లో పనిచేసే అద్భుత అవకాశం. సరైన విద్యార్హతలు, వయసు ఉంటే ఆ ఉద్యోగం మీ సొంతమే కావచ్చు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్ ట్రాపిక్ కంట్రోల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం...
పూర్తి కథనం చదవండిMobile Number: మొబైల్ నెంబర్‌లో 10 అంకెలే ఎందుకు ఉంటాయి.? ఏ నెంబర్ దేనిని సూచిస్తుందో తెలుసా?
ఒకప్పుడు ఊరిలో ఒక ఫోన్ ఉందంటేనే గొప్పగా భావించే వారు. ఆ తర్వాత వీధికో ఫోన్ వచ్చేసింది, అనంతరం ఇంటికో ఫోన్ వచ్చేసింది. ఇక ఎప్పుడైతే మొబైల్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయో ఒక్కొక్కరు రెండేసి ఫోన్‌లను ఉపయోగించే రోజులు వచ్చేశాయి. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అయితే మీ ఫోన్ నెంబర్‌లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? 10 అంకేలే ఎందుకు ఉంటాయి.? వీటి అర్థం ఏంటి.? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
MEGA VS ALLU: మెగా కాంపౌండ్ నుంచి బన్నీకి నో విషెస్.. జూ.ఎన్టీఆర్ మాత్రం అల్లూ బావ అంటూ..!
MEGA VS ALLU: మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య గ్యాప్ ఉన్నట్లు గతంలో అనే సందర్భాల్లో స్పష్టంగా అర్థమైంది. పుష్ప-2 సినిమా విడుదల సమయంలో విభేదాలు దాదాపు బహిర్గతం అయ్యాయి. కానీ బన్నీ అరెస్ట్‌తో తిరిగి మెగాస్టార్ చిరంజీవి అర్జున్ ఇంటికి వెళ్లడం, ఆ తర్వాత బన్నీ కూడా చిరంజీవి ఇంటికి వెళ్లడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు సర్దుమనిగాయని అందరూ భావించారు. కానీ అది జరగలేదనన్నది స్పష్టంగా ఈరోజు తెలిసిపోయింది. అర్జున్ పుట్టినరోజున మెగా కుటుంబం ఏం చేసిందో తెలుసా..