- Home
- Sports
- Cricket
- IPL LSG vs KKR: వాటే మ్యాచ్.. పరుగుల సునామీలో కేకేఆర్ పై లక్నో థ్రిల్లింగ్ విక్టరీ
IPL LSG vs KKR: వాటే మ్యాచ్.. పరుగుల సునామీలో కేకేఆర్ పై లక్నో థ్రిల్లింగ్ విక్టరీ
IPL LSG vs KKR: నికోలస్ పూరన్ క్రీజులో ఉంటే పూనకాలే అనేలా మరోసారి సూపర్ నాక్ అడాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ 4 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. రెండు టీమ్స్ అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగుల వర్షం కురిపించాయి. దీంతో ఐపీఎల్ 2025లో భారీ స్కోర్ మ్యాచ్ గా నిలిచింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
LSG vs KKR
KKR vs LSG IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో మళ్లీ పరుగులు వర్షం మొదలైంది. ఐపీఎల్ 2025 21వ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడింది. ఈ మ్యాచ్ లో రెండు టీమ్ లు డబుల్ సెంచరీ స్కోర్లు సాధించాయి. చివరి ఓవర్ వరకు రెండు జట్లు గెలుపుకోసం పోరాడాయి. అయితే, చివరి ఓవర్ లో అద్భుతమైన బౌలింగ్ తో లక్నో టీమ్ 4 పరుగులు తేడాతో విజయం సాధించింది.
KKR vs LSG
వారి సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్ వేదికపై కోల్‌కతా నైట్ రైడర్స్ ను లక్నో సూపర్ జెయింట్స్ ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ సీజన్‌లో లక్నోకు ఇది మూడో విజయం. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నో 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసి 4 పరుగుల గేడాతో ఓడిపోయింది. ఈ సీజన్‌లో కేకేఆర్ కు మూడో ఓటమి.
LSG vs KKR
LSG vs KKR: చివరి ఓవర్ వరకు ఉత్కంఠ
కోల్‌కతా విజయానికి చివరి ఓవర్‌లో 24 పరుగులు కావాలి. రింకు సింగ్, హర్షిత్ రాణా క్రీజులో ఉన్నారు. రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్ మొదటి బంతికి హర్షిత్ రాణా ఫోర్ కొట్టాడు. అతను రెండో బంతిని మిస్ అయ్యాడు. మూడో బంతికి హర్షిత్ సింగిల్ తీయడంతో, రింకు కోల్‌కతాకు 3 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. మూడు సిక్సర్లు బాది ఉంటే మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసేది. అయితే, ఇది జరగలేదు. రింకు వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. చివరి బంతికి అతను సిక్స్ కూడా కొట్టాడు, కానీ కోల్‌కతా జట్టు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. దీంతో మ్యాచ్ ను కోల్పోయింది.
Ajinkya Rahane and Sunil Narine (Photo: IPL/BCCI)
రహానే-అయ్యర్ అదరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు
239 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా జట్టు ఆరంభంలోనే దూకుడుగా ఆడటం మొదలుపెట్టింది. మొదటి 6 ఓవర్లలో 90 పరుగులు చేసింది. క్వింటన్ డి కాక్ 15 పరుగులు చేశాడు. ఆ తర్వాత రహానే, సునీల్ నరైన్ పరుగుల తుఫాను సృష్టించారు.
ఈ జోడీ కేవలం 23 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఏడో ఓవర్ రెండో బంతికే నరైన్ ఔటయ్యాడు. 13 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత, రహానేకు వెంకటేష్ అయ్యర్ జత కలిశాడు. వారిద్దరూ 40 బంతుల్లో 71 పరుగులు జోడించారు. కోల్‌కతా లక్ష్యాన్ని సులభంగా చేరుకునేలా చేశారు. కానీ, వికెట్లు పడటంతో పరిస్థితి మారిపోయింది. రహానే 35 బంతుల్లో 61 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 45 పరుగులు చేశాడు.
Nicholas Pooran
నికోలస్ పూరన్ విధ్వంసం
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ కు టాపార్డర్ నుంచి అద్భుమైన ఇన్నింగ్స్ లు వచ్చాయి. లక్నో 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్ అద్భుమైన ఆరంభాన్ని ఇచ్చారు. మార్ష్ 48 బంతుల్లో 81 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. మార్క్రామ్ తన 28 బంతుల ఇన్నింగ్స్‌లో 47 పరుగులు చేశాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 10.2 ఓవర్లలో 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ విధ్వంసం రేపాడు. 87 పరుగులు తన సూపర్ నాక్ లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు.