Priyansh Arya: 6 6 6 6 6 6.. ఊచకోత.. ప్రియాంష్ ఆర్య సెంచరీ విధ్వంసం
Priyansh Arya: పంజాబ్ కింగ్స్ యంగ్ ప్లేయర్ ప్రియాంష్ ఆర్య సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. మథీషా పతిరానా బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్సర్లతో వరుసగా 6,6,6,4 బాది 23 పరుగులు రాబట్టాడు. 39 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ నాల్గో సెంచరీ కావడం విశేషం. అతని కంటే ముందు గేల్ (30), యూసుఫ్ పఠాన్ (37), మిల్లర్ (38) మాత్రమే ఐపీఎల్లో వేగవంతమైన సెంచరీలు సాధించారు. అలాగే, ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన రెండో భారతీయుడిగా ప్రియాంష్ ఆర్య నిలిచాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Priyansh Arya
Priyansh Arya: తన తొలి ఐపీఎల్ సీజన్ లోనే అదరిపోయే ఇన్నింగ్స్ లు ఆడుతున్న యంగ్ ప్లేయర్ ప్రియాంష్ ఆర్య.. మరోసారి దుమ్మురేపే బ్యాటింగ్ తో దిగ్గజ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ముల్లన్ పూర్ లో పరుగుల సునామీ సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలో 4వ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు. దేశవాళీ క్రికెట్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది సంచనల రేపిన ప్రియాంష్ ఆర్య.. ఐపీఎల్ పంజాబ్ కింగ్ తరఫున ఆడుతూ చెన్నై సూపర్ కింగ్స్ పై హ్యాట్రిక్ ఫోర్లు, సిక్సర్లతో మరోసారి తన బ్యాటింగ్ తో దుమ్మురేపాడు.
Priyansh Arya
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 22వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) - చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఎప్పటిలాగే దూకుడుగా బ్యాటింగ్ ను మొదలుపెట్టింది. కానీ, వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. అప్పుడే మొదలుపెట్టాడు యంగ్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య తన బ్యాటింగ్ సునామీని. టెర్రిఫిక్ నాక్ తో అదిరిపోయే సెంచరీ కొట్టాడు. పంజాబ్ టీమ్ ను భారీ స్కోర్ దిశగా ముందుకు నడిపించాడు.
PBKS vs CSK: Priyansh Arya hits 39-ball IPL hundred
మొదటి నుంచి దూకుడుగా ఆడిన ప్రియాంశ్ ఆర్య కేవలం 19 బంతుల్లోనే తన మొదటి ఐపీఎల్ హాఫ్ సెంచరీ కొట్టాడు. తన హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. అంతటితో అతని ఇన్నింగ్స్ ఆగలేదు. మరింత దూకుడు పెంచాడు. వచ్చిన చెన్నై బౌలర్లందరినీ చెగుడుగు ఆడుకుంటూ వరుసగా ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. 39 బంతుల్లో తొలి ఐపీఎల్ సెంచరీని సాధించాడు. 103 పరురగుల తన సెంచరీ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ 2025లో రెండో సెంచరీ ఇది. అలాగే, రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం.
తన సెంచరీ ఇన్నింగ్స్ లో చెన్నై స్టార్ బౌలర్ మథీషా పతిరానా బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం హైలెట్ గా నిలిచింది. ఆ ఓవర్ లో వరుసగా 6,6,6,4 లతో 23 పరుగులు సాధించాడు ప్రియాంశ్ ఆర్య. 39 బంతుల్లోనే ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ నాల్గో సెంచరీ కొట్టాడు. అతని కంటే ముందు గేల్ (30 బంతులు), యూసుఫ్ పఠాన్ (37 బంతులు), మిల్లర్ (38 బంతులు) మాత్రమే ఐపీఎల్లో వేగవంతమైన సెంచరీలు సాధించారు. ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్ ప్రియాంష్ ఆర్య నిలిచాడు.