LSG vs KKR: కేకేఆర్ ను దంచికొట్టారు భయ్యా
KKR vs LSG IPL 2025: ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 238/3 పరుగులతో ఐపీఎల్ లో తమ రెండో అత్యధిక స్కోర్ ను నమోదుచేసింది. ఈ మ్యాచ్ లో మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్ లు అద్భుతమైన బ్యాటింగ్ లో పరుగుల వరద పారించారు. వరుస పెట్టి ఫోర్లు, సిక్సర్లు బాదారు. దీంతో లక్నో టీమ్ కేకేఆర్ ముందు 239 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది.

IPL LSG vs KKR: విధ్వంసం, పరుగులు సునామీ, సిక్సర్ల మోత అంటే ఏంటో చూపించారు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) బ్యాటర్లు. అద్భుతమైన బ్యాటింగ్ తో కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) బౌలింగ్ ను దంచికొట్టారు. మరీ ముఖ్యంగా ఐడెన్ మర్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించారు. వచ్చిన బాల్ ను వచ్చినట్టుగా బౌండరీ లైన్ దాటించారు. లక్నో బ్యాటర్ల దెబ్బకు కేకేఆర్ టీమ్ కు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి కనిపించింది. రిషబ్ పంత్ టీమ్ లక్నో 20 ఓవర్లలో 238-3 పరుగులు చేసింది.
Nicholas Pooran
ఈ మ్యచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, రిషబ్ పంత్ టీమ్ లక్నో కు మొదట బ్యాటింగ్ అప్పటించడం తప్పని మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అర్థమైంది. లక్నో బ్యాటర్లు క్రీజులోకి వచ్చినవాళ్లు వచ్చినట్టుగా కోల్ కతా బౌలింగ్ ను దంచికొట్టారు. పరుగులు సునామీ సృష్టించారు.
Image Credit: Twitter/LSG
మార్ష్ మరో సూపర్ నాక్
లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్ లు ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగులు పిండుకున్నారు. మార్క్రామ్ దూకుడుగా అడుతూ 28 బంతుల్లోనే 47 పరుగులు ఇన్నింగ్స్ ను ఆడాడు. అలాగే, మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ 48 బంతుల్లో 81 పరుగులు సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. మార్ష్ తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు.
Nicholas Pooran
నికోలస్ పూరన్.. పరుగులు సునామీ సృష్టించాడు
నికోలస్ పూరన్ మరోసారి దంచికొట్టాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. 241.67 స్ట్రైక్ రేటుతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. గ్రౌండ్ కు అన్ని వైపులా బౌండరీలు బాదుతూ నికోలస్ పూరన్ ఉంటే పూనకాలే అనే విధంగా బ్యాటింగ్ ను కొనసాగించాడు.
నికోలస్ పూరన్ కేవలం 36 బంతుల్లో 87 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు. తన సూపర్ నాక్ లో పూరన్ 7 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. మరీ ముఖ్యంగా తన జాతీయ టీమ్ మెట్ ఆండ్రీ రస్సెల్ బౌలింగ్ లో వరుసగా ఫోర్లు సిక్సర్లతో అదరగొట్టాడు. రస్సెల్ వేసిన 18వ ఓవర్ లో 4 0 4 6 4 6 తో 24 పరుగులు కొట్టాడు. దీంతో 20 ఓవర్లలో లక్నో టీమ్ 3 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. కేకేఆర్ ముందు 239 పరుగులు టార్గెట్ ను ఉంచింది.
MI vs LSG
ఈ స్కోర్ తో లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ లో తమ రెండో అత్యధిక టీమ్ స్కోర్ ను నమోదుచేసింది. LSG అత్యధిక తొలి ఇన్నింగ్స్ స్కోర్లు ఇలా ఉన్నాయి..
257/5 vs PBKS, మొహాలీ, 2023
238/3 vs KKR, కోల్‌కతా, 2025
214/6 vs MI, ముంబై, 2024
210/0 vs KKR, ముంబై, 2022
209/8 vs DC, విశాఖపట్నం, 2025