MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Gardening
  • Indoor Plants: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే ఏసీల అవసరమే ఉండదు

Indoor Plants: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే ఏసీల అవసరమే ఉండదు

Indoor Plants: వేసవికాలం ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ టైంలో నిరంతరం ఏసీలు పనిచేస్తుంటే కరెంట్ బిల్లు రూ.వేలల్లో వస్తుంది. అలాకాకుండా మీ ఇంట్లో ఈ మొక్కలు పెంచుకుంటే ఆటోమేటిక్ గా మీ ఇల్లు చల్లగా ఉంటుంది. ప్రత్యేకమైన ఆ మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 08 2025, 05:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సాధారణంగా ప్రతి సమ్మర్ లో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ ఏడాది మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎండల తీవ్రతను తట్టుకోవడానికి అందరూ ఏసీల పైనే ఆధారపడతారు. దీనివల్ల కరెంటు బిల్లు పెరగడంతో పాటు ఎక్కువసేపు ఏసీ గదుల్లో ఉండడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆర్టిఫిషియల్ గా చల్లదనాన్ని క్రియేట్ చేసుకునే బదులు, ప్రకృతి ఇచ్చిన మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఇల్లంతా చల్లగా ఉంటుంది. ఏ గదిలో ఎలాంటి మొక్కలు పెంచుకుంటే ఇల్లు చల్లగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
 

ఇది కూడా చదవండి అక్షయ తృతీయ కరెక్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?

35

బెడ్ రూమ్ లో స్నేక్ ప్లాంట్ ను పెంచుకోండి. ఇది రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేస్తుంది. దీంతో రాత్రి వేళల్లో గది చల్లగా మారుతుంది. 

లివింగ్ రూమ్ లో అరేకా ప్లాంట్ పెంచుకోండి. ఇది గాలిలో ఉండే తేమను అలాగే నిలిపి ఉంచుతుంది. అందువల్ల గది ఎప్పుడు నార్మల్ టెంపరేచర్ లో ఉంటుంది. 
 

45

బాల్కనీలో గాని, వీధివైపు ఉండే గదిలో ఫికస్ మొక్కలు పెంచండి. ఇవి గాలిలో ఉండే కాలుష్యాన్ని తగ్గిస్తాయి. గాలి నాణ్యతను పెంచుతాయి. ఉష్ణోగ్రతను కూడా కంట్రోల్ చేస్తాయి. 

గోల్డెన్ ఫొథోస్ అనే ఈ విదేశీ మొక్కను ఇంట్లో జాగ్రత్తగా పెంచితే దాని చుట్టూ ఉన్న వాతావరణం చల్లబడుతుంది. కానీ ఈ మొక్క పెరగడానికి కాస్త వెలుతురు కావాలి. అందువల్ల మీ ఇంట్లో కాస్త వెలుతురు ఉండే ప్రాంతంలో ఈ మొక్కను పెంచండి. 
 

55

ఈ కాలంలో కలబంద మొక్కను పెంచని వాళ్ళు ఎవరూ ఉండరు. చాలామంది ఈ మొక్కను ఇంటి ఆవరణలో పెంచుతారు. కానీ దీన్ని ఇంట్లో గదుల్లో పెంచితే ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది. వాతావరణంలో వేడిని కూడా తగ్గిస్తుంది. 

ఈ మొక్కలన్నీ ప్రతి నర్సరీలో అందుబాటులో ఉంటాయి. మీ సమీపంలో ఉన్న నర్సరీకి వెళ్లి ఇప్పుడే ఈ మొక్కలు తెచ్చుకుని మీ ఇంటిని చల్లని ప్రదేశంగా మార్చుకోండి.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
తోటపని
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
వాతావరణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rainy Season Plants : వర్షాకాలంలో వేగంగా పెరిగే మొక్కలు ఇవే!
Recommended image2
Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే
Recommended image3
Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్క ఉంటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved