Nicholas Pooran: ఇదేం కొట్టుడు సామీ.. నికోలస్ పూరన్ దెబ్బకు స్టేడియం అదిరిపోయింది
KKR vs LSG IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ పరుగుల సునామీ రేపుతున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ 2025లో 5 మ్యాచ్ లు ఆడిన నికోలస్ పూరన్ 288 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో టాప్ స్కోరర్ గా ఆరెంజ్ క్యాప్ ను తనవద్ద ఉంచుకున్నాడు. పూరన్ ఇప్పటివరకు మూడు హాఫ్ సంచరీలు సాధించాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 87 పరుగులు నాటౌట్.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Nicholas Pooran (Photo: @ipl/X)
IPL LSG vs KKR: నికోలస్ పూరన్ క్రీజులో ఉంటే పూనకాలే.. వరుగుల వర్షం కురవాల్సిందే. సిక్సర్ల మోత మోగాల్సిందే. బౌలర్లకు చెమటలు పట్టాల్సిందే. అలాంటిందే మరోసారి జరిగింది. వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ఐఫీఎల్ 2025లో మరో సూపర్ నాక్ ఆడాడు. కేకేఆర్ బౌలింగ్ ను దంచికొట్టాడు. దీంతో లక్నో టీమ్ ఐపీఎల్ లో తన రెండో అత్యధిక స్కోర్ 238-3 పరుగులు చేసింది.
ఈ మ్యచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ టీమ్ లక్నో కు మొదట బ్యాటింగ్ కు దిగింది. పిచ్ బ్యాటింగ్ ను అనుకూలించడంతో లక్నో ప్లేయర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడటం మొదలుపెట్టారు.
Nicholas Pooran
లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్ లు ఓపెనర్లుగా మంచి ఆరంభం అదించగా, నికోలస్ పూరన్ సూపర్ నాక్ తో అదరిపోయే ఎండింగ్ ఇచ్చాడు. మార్క్రామ్ దూకుడుగా అడుతూ 28 బంతుల్లోనే 47 పరుగులు చేయగా, మరో ఓపెనర్ మార్ష్ 48 బంతుల్లో 81 పరుగులు సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు.
నికోలస్ పూరన్ విధ్వంసం
ఐపీఎల్ 2025లో సూపర్ ఫామ్ లో ఉన్న నికోలస్ పూరన్ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ తో పరుగులు వర్షం కురిపించాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న అతను కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. పురాన్ కేవలం 36 బంతుల్లో 87 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు. తన అద్భుతమైన బ్యాట్ పవర్ తో సూపర్ షాట్లు ఆడాడు. సిక్సర్ల మోత మోగించాడు.
Nicholas Pooran
241.67 స్ట్రైక్ రేటుతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. గ్రౌండ్ కు అన్ని వైపులా బౌండరీలు బాదుతూ నికోలస్ పూరన్ ఉంటే పూనకాలే అనే విధంగా బ్యాటింగ్ ను కొనసాగించాడు. తన 87 పరుగుల ఇన్నింగ్స్ లో పూరన్ 7 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు.
తన వెస్టిండీస్ టీమ్ మెట్ ఆండ్రీ రస్సెల్ బౌలింగ్ లో వరుసగా ఫోర్లు సిక్సర్లతో అదరగొట్టాడు. ఈ ఆల్ రౌండర్ వేసిన ఒక ఓవర్లో పురాన్ తన మొదటి బంతిని బౌండరీ మీదుగా ఫోర్ గా పంపాడు. రెండో బంతికే రస్సెల్ పరుగులు ఇవ్వలేదు. మూడవ బంతిని పూరన్ లెగ్ సైడ్‌లో అద్భుతమైన ఫోర్ కొట్టాడు. దీని తర్వాత అతను నాలుగో బంతిని సిక్సర్ కొట్టాడు. అంతటితో ఇది అయిపోలేదు. రస్సెల్ వేసిన ఐదవ బంతికి ఒక ఫోర్, ఆరో బంతికి ఒక సిక్సర్ కొట్టి మొత్తం 24 పరుగులు సాధించాడు. దీంతో 20 ఓవర్లలో లక్నో టీమ్ 3 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. ఈ స్కోర్ తో లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ లో తమ రెండో అత్యధిక టీమ్ స్కోర్ ను నమోదుచేసింది.
అద్భుతమైన ఫామ్‌లో నికోలస్ పూరన్
ఈ ఐపీఎల్ సీజన్‌లో పురాన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుసగా సూపర్ నాక్ లు ఆడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అతను 75 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 70 పరుగులతో అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. పంజాబ్ కింగ్స్‌పై 44, ముంబై ఇండియన్స్‌పై 12 పరుగులు ఇన్నింగ్స్ లను ఆడాడు. ప్రస్తుతం నికోలస్ పూరన్ ఐపీఎల్ 2025లో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. అతని సూపర్ నాక్ తో లక్నో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. నికోలస్ పూరన్ ఐపీఎల్ లో ఇప్పటివరకు 81 మ్యాచ్‌లు ఆడి 2057 పరుగులు చేశాడు. ఇందులో 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు.