MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • శుభకార్యాల్లో రూ.116 ఎందుకు చదివిస్తారు? ఈ సాంప్రదాయం వెనక ఆసక్తికర స్టోరీ

శుభకార్యాల్లో రూ.116 ఎందుకు చదివిస్తారు? ఈ సాంప్రదాయం వెనక ఆసక్తికర స్టోరీ

మనం బందువులు, స్నేహితులు లేదా తెలిసినవారి ఇంట శుభకార్యానికి వెళ్ళినప్పుడు డబ్బులు చదివిస్తుంటాం. అయితే రూ.100, 500, 1000 ఇలా కాకుండా రూ.116, 516, 1116 చదివిస్తాం. ఇలా ఎందుకు చేస్తామో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రూ.116 సాంప్రదాయం ఎప్పుడు మొదలయ్యింది? ఎందుకు మొదలయ్యింది? అనేది ఇక్కడ తెలుసుకుందాం. దీని వెనక ఆసక్తికర స్టోరీ ఉంది. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 08 2025, 06:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Why Do We Offer 116 Rupees in Auspicious Events?

Why Do We Offer 116 Rupees in Auspicious Events?

మనం ఏదయినా శుభకార్యానికి వెళితే ఉత్తచేతులతో వెళ్ళకుండా బహుమతి తీసుకువెళతాం. బహుమతి మరిచిపోతే తోచినంత డబ్బులు చదివిస్తాం. అలాగే పూజారులకు, పండితులకు కూడా డబ్బులు దక్షిణగా ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటాం. వినాయకచవితి,  దుర్గాష్టమి, ఇతర ధార్మిక కార్యక్రమాల కోసం కూడా తోచినంత చందా ఇస్తుంటాం. ఇలా డబ్బులు ఇచ్చే సమయంలో మీరో విషయం గమనించారా... 100, 500, 1000, 10,000, 1,00,000 ఇలా ఎంతిచ్చినా వాటికి చివర్లో 16 వచ్చేటట్లు ఇస్తుంటాం అంటే 116, 516, 1116,10,116, 1,00.116 ఇస్తుంటాం. ఇలా నూట పదహార్లు ఇవ్వడం సాంప్రదాయంలో భాగమయ్యింది... ఆనవాయితీగా మారింది. 

అయితే ఇలా 116 పదహార్లు ఇవ్వడం వెనక ఎలాంటి సాంప్రదాయం లేదట. చివర్లో సున్నా ఉండటం శుభప్రదం కాదనే 116 చేరుస్తారనే వాదన ఉంది. ఇదికూడా నిజం కాదట. ఇలా నూట పదహార్లు అనే కాన్సెప్ట్ నిజాంల కాలంలో ప్రారంభమయ్యిందట. దీని వెనక ఆసక్తికరమైన స్టోరీ ఉందని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు తెలిపారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Why Do We Offer 116 Rupees in Auspicious Events?

Why Do We Offer 116 Rupees in Auspicious Events?

116 రూపాయల చదివింపుల వెనకున్న స్టోరీ :  

ఇప్పటిలాగే గతంలో కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలు వేరువేరుగా ఉండేవి. తెలంగాణను నిజాంలు పాలిస్తే ఏపీని బ్రిటీషర్లు పాలించారు. ఆ సమయంలో ఇరుప్రాంతాల్లో వేరువేరు కరెన్సీ చలామనిలో ఉండేది. తెలంగాణ కరెన్సీ విలువకంటే ఏపీ కరెన్సీ విలువ కొంత ఎక్కువగా ఉండేది.  

అయితే నిజాం నవాబులతో పాటు తెలంగాణలో సంస్థానాధీశులు మంచి కళాపోషకులు.  ముఖ్యంగా వనపర్తి, గద్వాల సంస్థానంలో కళాకారులు, సాహిత్యకారులు, పండితులకు మంచి గుర్తింపు ఉండేది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ నుండి కూడా కళాకారులు తెలంగాణకు వచ్చేవారు. వారికి నిజాం పాలకులు, సంస్థానాధీశులు సంభావన ఇచ్చేవారు. ఎక్కువగా 100 రూపాయలు ఇచ్చేవారు. 

అయితే తెలంగాణలో చెలామని అయ్యే కరెన్సీ ఏపీ కళాకారులు, పండితుల చేతికి వచ్చేది. అయితే ఈ డబ్బులు వారి రాష్ట్రానికి వెళ్లేసరికి విలువ తగ్గేది. 100 రూపాయలకు ఏ 80, 90 రూపాయలు మాత్రమే వచ్చేవి. దీంతో కళాకారులు నిరాశకు గురయ్యేవారు. వంద రూపాయలు పొందిన ఆనందం వారికి ఉండేదికాదు. ఈ విషయం తెలంగాణ పాలకులకు తెలిసింది.  

 

33
Why Do We Offer 116 Rupees in Auspicious Events?

Why Do We Offer 116 Rupees in Auspicious Events?

కళాకారులు, పండితులు సంభావన విషయంలో అసంతృప్తికి గురికాకుండా ఏం చేయాలో తెలంగాణ పాలకులు ఆలోచించారు. ఈ క్రమంలోనే వారికి 116 ఆలోచన తట్టింది. తెలంగాణ కరెన్సీ 116 ఇస్తే ఏపీలో అది 100 రూపాయలు అయ్యేది. ఇలా కళాకారులు, పండితులకు 116 రూపాయలు సంభావనగా ఇవ్వడం ప్రారంభించారు. దీంతో ఏపీనుండి వచ్చే పండితులు, కళాకారులు ఆనందించేవారు. 

ఇలా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మధ్య కరెన్సీ విలువలో తేడా రూ.116 చెల్లింపుల సాంప్రదాయానికి కారణమయ్యింది. తర్వాతికాలంలో ఇది ఆనవాయితీగా మారింది. శుభకార్యాల్లో కూడా 116 రూపాయలు చదివించడం ప్రారంభమయ్యింది. ఇది మరింత విస్తరించి చందాలకు కూడా పాకింది. ఇలా అనాదిగా 116 రూపాయల సాంప్రదాయం వస్తోంది... లక్షలు కోట్ల రూపాయలు విరాళంగా లేదా దానంగా ఇచ్చినా దానికి 116 కలిపి ఇవ్వకుంటే ఏదో అపచారంగా భావించే పరిస్థితి ప్రస్తుతం ఉంది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జీవనశైలి
హిందూ పండుగలు
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Recommended image2
Blouse Design:స్టైలిష్ బ్యాక్ నెక్ బ్లౌజు డిజైన్లు..పట్టుచీరలకు బెస్ట్
Recommended image3
Expensive Fruit: రెండు పండ్లు రూ.34 లక్షలు.. ఈ పండు కొనాలంటే మినిమమ్ అంబానీలు అవ్వాలి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved