MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Flash Flood Alert: తీరం దాటుతున్న తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Flash Flood Alert: తీరం దాటుతున్న తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఏపీ, తెలంగాణల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 23 2026, 08:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన వాయుగుండం
Image Credit : Gemini

బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. బుధవారం రాత్రికి ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాల మధ్య, విశాఖపట్నం, గోపాల్‌పూర్ సమీపంలో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) స్పష్టం చేసింది.

ప్రస్తుతం కళింగపట్నం, విశాఖపట్నానికి సమీపంలో కేంద్రీకృతమైన ఈ తుపాను ప్రభావంతో తీరం వెంట గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. సముద్రం తీవ్ర అలజడిగా మారడంతో మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉత్తరాంధ్రకు ఆకస్మిక వరద ముప్పు.. స్కూళ్లకు సెలవులు
Image Credit : Gemini

ఉత్తరాంధ్రకు ఆకస్మిక వరద ముప్పు.. స్కూళ్లకు సెలవులు

తీవ్ర వాయుగుండం తాకిడికి ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోతున్నాయి. వర్షాలు దంచికొడుతుండటంతో వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం బుధవారం సెలవు ప్రకటించింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో కంట్రోల్ రూమ్‌లు, పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. అత్యవసరంగా గర్భిణీలను ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

35
తెలంగాణలోని 18 జిల్లాలకు రెడ్ అలర్ట్
Image Credit : Gemini

తెలంగాణలోని 18 జిల్లాలకు రెడ్ అలర్ట్

మరోవైపు తెలంగాణను కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతం తీవ్ర వాయుగుండానికి తోడు కర్ణాటక-కోస్తాంధ్ర మీదుగా ద్రోణి కొనసాగుతుండటంతో ఉత్తర, తూర్పు తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ సహా మొత్తం 18 జిల్లాలకు బుధవారం రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి.

45
హైదరాబాద్‌లో జలమయమైన రోడ్లు
Image Credit : Gemini

హైదరాబాద్‌లో జలమయమైన రోడ్లు

హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం నుంచే ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. సికింద్రాబాద్, అమీర్‌పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. పండుగ వాతావరణం, ఆఫీసుల ముగింపు సమయం కావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీసు యంత్రాంగం సమన్వయంతో క్షేత్రస్థాయిలో పని చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నీరు నిలిచిన చోట వెంటనే డ్రైనేజీ బృందాలను రంగంలోకి దించారు.

55
జాగ్రత్తలు వహించాలన్న విపత్తు నిర్వహణ సంస్థ
Image Credit : Gemini

జాగ్రత్తలు వహించాలన్న విపత్తు నిర్వహణ సంస్థ

రాబోయే 24 నుండి 48 గంటలు అత్యంత కీలకమని ఏపీ, తెలంగాణ విపత్తు నిర్వహణ సంస్థలు ప్రకటించాయి. ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. ఈదురుగాలులు వీచే సమయంలో పాత భవనాలు, చెట్లు, కరెంట్ స్తంభాలు, హోర్డింగుల కింద నిలబడకూడదని సూచించారు. రైల్వే శాఖ కూడా అప్రమత్తమై విశాఖ-కిరండోల్ మార్గంలో పలు రైళ్లను రద్దు చేసింది. అత్యవసర సహాయం కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Recommended image2
9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Recommended image3
Dasara Special Trains: గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే.. దసరా బతుకమ్మ ప్రత్యేక రైళ్లు
Related Stories
Recommended image1
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved