MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి

Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి

Farmer ID:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు రైతుల కోసం డిజిటల్ ఫార్మర్ ఐడీ నమోదును వేగవంతం చేశాయి. పీఎం కిసాన్, రైతు భరోసా పథకాల లబ్ధి పొందేందుకు అర్హులైన రైతులందరూ 11 అంకెల యూనిక్ ఫార్మర్ ఐడీ పొందడం తప్పనిసరి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 21 2026, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఫార్మర్ ఐడీ లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు ఆగిపోతాయా?
Image Credit : chatgpt

ఫార్మర్ ఐడీ లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు ఆగిపోతాయా?

తెలంగాణలోని అన్నదాతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీలు మీ ఖాతాలోకి నేరుగా రావాలంటే ఇకపై ఫార్మర్ ఐడీ (Farmer ID) తప్పనిసరి. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద ఈ 'ఫార్మర్ రిజిస్ట్రీ' ప్రక్రియను ప్రారంభించారు. అసలైన అర్హులైన రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా పథకాలు అందేలా చూసేందుకే ప్రభుత్వం ఈ డిజిటల్ ఐడీ సిస్టమ్‌ను తీసుకువచ్చింది. ఈ ఐడీ తీసుకోకపోతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో పాటు ఇతర ప్రయోజనాలు ఆగిపోయే ప్రమాదం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫార్మర్ ఐడీ అంటే ఏమిటి? ఎందుకు అంత ముఖ్యమైనది?
Image Credit : pexels

ఫార్మర్ ఐడీ అంటే ఏమిటి? ఎందుకు అంత ముఖ్యమైనది?

ఫార్మర్ ఐడీ అనేది ప్రతి రైతుకు కేటాయించే ఒక ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు కార్డు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పీఎం కిసాన్ (ఏడాదికి రూ. 6,000), రైతు భరోసా, పంటల ఇన్సూరెన్స్, రాయితీ ఎరువులు, విత్తనాలు, ప్రభుత్వ పంట రుణాలు నేరుగా రైతుల ఖాతాల్లోకి చేరడానికి ఈ ఐడీ ఉపయోగపడుతుంది. దళారుల ప్రమేయం లేకుండా, నిజమైన లబ్ధిదారులను గుర్తించి సాయం అందించడానికే ఈ డిజిటల్ రిజిస్ట్రేషన్ నిర్వహిస్తున్నారు.

36
ఫార్మర్ ఐడీ నమోదుకు ఏమేం ఆధారాలు కావాలి?
Image Credit : Getty

ఫార్మర్ ఐడీ నమోదుకు ఏమేం ఆధారాలు కావాలి?

ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభం. దీని కోసం రైతులు ఎలాంటి సంక్లిష్టమైన పత్రాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీ దగ్గర క్రింది ఆధారాలు ఉంటే సరిపోతుంది..

• రైతు ఆధార్ కార్డు

• ఆధార్‌తో లింక్ అయిన యాక్టివ్ మొబైల్ నంబర్ (ఓటీపీ కోసం)

• పట్టాదారు పాస్‌బుక్ వివరాలు

46
ఎవరిని సంప్రదించాలి? ఫార్మార్ ఐడీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి?
Image Credit : Asianet News

ఎవరిని సంప్రదించాలి? ఫార్మార్ ఐడీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి?

రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం రెండు సులభమైన మార్గాలను అందుబాటులోకి తెచ్చింది..

1. స్థానిక మీసేవ కేంద్రాలు: మీకు సమీపంలో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్ళి ఆధార్, పాస్‌బుక్ వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు.

2. వ్యవసాయ విస్తరణాధికారులు (AEO): ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండే ఏఈఓలను కలసి ఉచితంగా లేదా ప్రభుత్వం సూచించిన పద్ధతిలో మీ వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవచ్చు.

56
సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు ప్రత్యేక డ్రైవ్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
Image Credit : Asianet News

సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు ప్రత్యేక డ్రైవ్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

రైతులందరికీ డిజిటల్ ఐడీలు కేటాయించేందుకు గాను వ్యవసాయ శాఖ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నిర్ణీత గడువు లోపు అర్హులైన రైతులందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సెప్టెంబర్ 30 చివరి తేదీ కాబట్టి ఆలోపే మీ వివరాలను అప్‌డేట్ చేసుకోవడం మంచిది.

66
ఒకవేళ ఫార్మర్ ఐడీ తీసుకోకపోతే ఏం జరుగుతుంది?
Image Credit : pixabay

ఒకవేళ ఫార్మర్ ఐడీ తీసుకోకపోతే ఏం జరుగుతుంది?

ఈ డిజిటల్ ఐడీ లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోయే అవకాశం ఉంది. పీఎం కిసాన్ తదుపరి విడత డబ్బులు, రైతు భరోసా సాయం, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. పంట నష్టం జరిగినప్పుడు వచ్చే ఇన్సూరెన్స్ పరిహారం పొందాలన్నా ఈ ఐడీ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎలాంటి ఆలస్యం చేయకుండా సెప్టెంబర్ 30లోగా మీ సమీప ఏఈఓ లేదా మీసేవ కేంద్రాన్ని సంప్రదించి ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ పథకాలు
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నిర్మలా సీతారామన్ ఇంటి ముందు రాసున్న.. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసా.?
Recommended image2
ఇక‌పై అమెరికా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో అమెరికా ప్ర‌భుత్వ వ‌ర్సిటీ వ‌స్తోంది
Recommended image3
Vegetables Price : హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు ఎలా ఉన్నాయి? ఈ కూరగాయ కిలో రూ.100?
Related Stories
Recommended image1
Snake Facts: రెండు తలల పాము.. వైరల్ వీడియోల వెనుక ఉన్న అసలు నిజం ఇదే
Recommended image2
ElNino Weather Alert: పెరుగుతున్న ఎల్ నినో ముప్పు.. సర్కారు అలర్ట్.. అసలు ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved