MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Danam Nagender : హైదరాబాద్ ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు.. కేటీఆర్ రియాక్షన్ ఇదే..

Danam Nagender : హైదరాబాద్ ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు.. కేటీఆర్ రియాక్షన్ ఇదే..

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పడింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం దానం ఎమ్మెల్యేగా కొనసాగడానికి వీళ్లేదని తేల్చింది.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 18 2026, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
దానం నాగేందర్ కు హైకోర్టు షాక్
Image Credit : X/Danam Nagender

దానం నాగేందర్ కు హైకోర్టు షాక్

Danam Nagender : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి అధికారం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ షాక్ తగిలింది. ఆయన పార్టీ పిరాయించినట్లు తేల్చిన తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనర్హుడిగా ప్రకటించింది... ఈ మేరకు అత్యున్నత ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అసలేంటి దానం నాగేందర్ వివాదం?
Image Credit : X/Danam Nagender

అసలేంటి దానం నాగేందర్ వివాదం?

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే అధికారాన్ని కోల్పోవడంతోనే బిఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. వీరిలో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి గెలిచిన దానం నాగేందర్ ఒకరు.

ఇలా తమ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బిఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో దానం నాగేందర్ పై ఫిర్యాదుచేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు ఈ వ్యవహారంపై పలుమార్లు విచారణ జరిపింది... పూర్తి సమాచారాన్ని సేకరించి, ఇరుపక్షాల వాదనలు వింది. సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ ఎంపీగా పోటీచేసిన దానం పార్టీ పిరాయించినట్లు నిర్దారించింది… ఈ మేరకు ఇవాళ (సెప్టెంబర్ 18) దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై తుదితీర్పు ఇచ్చింది. అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది... దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది.

33
హైకోర్టు తీర్పుపై కేటీఆర్ కామెంట్స్
Image Credit : X/BRS

హైకోర్టు తీర్పుపై కేటీఆర్ కామెంట్స్

పార్టీ పిరాయింపు వ్యవహారంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టు అనర్హత వేటు వేయడంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఎక్స్ లో ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు...''సత్యమేవ జయతే !! కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను గౌరవనీయ హైకోర్టు ఈరోజు అనర్హుడిగా ప్రకటించింది. మిగిలిన ఫిరాయింపుదారులకు కూడా త్వరలోనే ఇదే గతి పడుతుంది'' అంటూ ధీమా వ్యక్తం చేశారు.

Satyameva Jayate !! 

BRS MLA Danam Nagendar who defected to Congress got disqualified by the Hon’ble High Court today 

The rest of the defectors will also meet the same fate soon

— KTR (@KTRBRS) September 18, 2026

దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కోర్టును ఆశ్రయించిన పాడి కౌశిక్ రెడ్డి కూడా స్పందించారు. హైకోర్టు తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. ఇది కేవలం దానం నాగేందర్ ఇష్యూ కాదు... పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు వర్తిస్తుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన వీరిపై కూడా అనర్హత వేటు పడటం ఖాయమన్నారు. త్వరలోనే జరగనున్న ఖైరతాబాద్ బైఎలక్షన్ లో మళ్లీ బిఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

LIVE: తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే @KaushikReddyBRS మీడియా సమావేశంhttps://t.co/QGOiQcP2pu

— BRS Party (@BRSparty) September 18, 2026

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్ అంత ఉన్న దేశం.. ప్ర‌పంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఎలా మారింది.?
Recommended image2
Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Recommended image3
9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Related Stories
Recommended image1
KTR : కోర్టు మెట్లెక్కిన కేటీఆర్ .. ఎందుకో తెలుసా?
Recommended image2
Telangana Assembly: కేటీఆర్, హరీశ్‌ సహా 22 మంది BRS ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved