MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Recharge Price Drop : ఎయిర్‌టెల్, జియో రీఛార్జ్ రేట్లు తగ్గే ఛాన్స్... ఎందుకో తెలుసా?

Recharge Price Drop : ఎయిర్‌టెల్, జియో రీఛార్జ్ రేట్లు తగ్గే ఛాన్స్... ఎందుకో తెలుసా?

పెరిగిన రీఛార్జ్ రేట్లతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పబోతోంది. టెలికాం కంపెనీలు చెల్లించే పన్నులను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది… దీంతో రీచార్జ్ ధరలు తగ్గనున్నాయి.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 19 2026, 10:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మొబైల్ రీఛార్జ్ రేట్ల తగ్గుతాయా?
Image Credit : Gemini AI

మొబైల్ రీఛార్జ్ రేట్ల తగ్గుతాయా?

భారీగా పెరిగిన మొబైల్ రీఛార్జ్ రేట్లతో జేబులు ఖాళీ చేసుకుంటున్న ప్రజలకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ ప్లాన్ రెడీ చేసింది. రాబోయే రోజుల్లో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా యూజర్ల నెలవారీ రీఛార్జ్ ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకుంటోంది. ఈమేరకు టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి కట్టే పన్నులను తగ్గించాలని సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

టెలికాం కంపెనీలపై పన్ను భారం తగ్గడం వల్ల నేరుగా ప్రజలకే లాభం చేకూరుతుంది. కేంద్రం టెలికాం మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ సమాచారం ప్రకారం.. సామాన్యులకు మొబైల్ సేవలను చౌకగా అందించేందుకు ప్రభుత్వం అత్యంత కీలకమైన రెండు కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ట్రాయ్ సంచలన నిర్ణయం
Image Credit : Gemini

ట్రాయ్ సంచలన నిర్ణయం

మొదటి విషయం ఏంటంటే... ప్రస్తుతం టెలికాం కంపెనీలు తమ మొత్తం ఆదాయంలో 8 శాతాన్ని లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ వాడుక ఛార్జీల కింద ప్రభుత్వానికి కడుతున్నాయి. ఈ 8 శాతం పన్నును 3 నుంచి 4 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు అధికారిక వర్గాల నుండి అందుతున్న సమాచారం. ప్రజలపై భారం తగ్గించేందుకే ఈ స్థాయిలో పన్నుల్లో కోత పెడుతున్నారు.

రెండో విషయం… టెలికాం కంపెనీలు కట్టే ఈ 8 శాతం పన్నులో 5 శాతం గ్రామీణ ఇంటర్నెట్ సదుపాయాల కోసం వెళ్తుంది. ఈ ఫండ్‌లో ఇప్పటికే చాలా డబ్బు జమైంది. అందుకే రాబోయే కొన్నేళ్ల పాటు ఈ 5 శాతం పన్ను వసూలును నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

34
ఈ ఆకస్మిక నిర్ణయానికి కారణం ఏంటి?
Image Credit : Gemini AI

ఈ ఆకస్మిక నిర్ణయానికి కారణం ఏంటి?

గత జులై నెలలో టెలికాం కంపెనీలు రీఛార్జ్ రేట్లను 15 నుంచి 25 శాతం వరకు పెంచేశాయి. దీంతో 28, 56, 84 రోజుల వాలిడిటీ ఉండే పాపులర్ ప్లాన్లు చాలా కాస్ట్‌లీ అయిపోయాయి. ఈ ధరల పెంపు వల్ల గ్రామీణ ప్రజలు, పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. చాలామంది రీఛార్జ్ చేయడమే మానేశారు లేదా సిమ్ కార్డులు తీసి పక్కన పెట్టేశారు. దీంతో పార్లమెంట్ నుంచి సోషల్ మీడియా వరకు దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అందుకే ఇప్పుడు ట్రాయ్, టెలికాం కంపెనీలతో మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.

44
ప్రజలకు కలిగే లాభం ఏంటి?
Image Credit : gemini ai

ప్రజలకు కలిగే లాభం ఏంటి?

ఒకవేళ ప్రభుత్వం పన్ను తగ్గిస్తే, టెలికాం కంపెనీలు ఇప్పుడున్న ప్లాన్ల ధరలను 10 నుంచి 15 శాతం వరకు తగ్గించే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం 299 రూపాయలుగా ఉన్న నెలవారీ ప్లాన్ ధర 250 నుంచి 260 రూపాయలకు తగ్గొచ్చు. వార్షిక ప్లాన్లు వేసుకుంటే ప్రజలకు నేరుగా 300 నుంచి 400 రూపాయల వరకు ఆదా అవుతుంది. టెలికాం కంపెనీలకు పన్ను మినహాయింపు దొరికిన వెంటనే ఈ కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు. ఇది ప్రజల జేబులకు భారం తగ్గించనుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Amazon: రూ. 30 వేల నుంచి రూ. 50 వేల బడ్జెట్‌లో టాప్ 5 ల్యాప్‌టాప్ డీల్స్.. SBI కార్డ్‌పై భారీ ఆఫర్లు
Recommended image2
Festive Sale: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఐఫోన్, శామ్‌సంగ్, వన్‌ప్లస్ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు
Recommended image3
Amazon vs Flipkart Sale: పండుగ సేల్ రచ్చ షురూ.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సీక్రెట్ బ్యాంక్ ఆఫర్లు ఇవే !
Related Stories
Recommended image1
Recharge Plan : కేవలం రూ.200 రీచార్జ్ తో 30GB డేటా, 15 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్.. ఇదికదా బంపరాఫర్ అంటే
Recommended image2
Recharge plan: రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved