MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Recharge Plan : కేవలం రూ.200 రీచార్జ్ తో 30GB డేటా, 15 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్.. ఇదికదా బంపరాఫర్ అంటే

Recharge Plan : కేవలం రూ.200 రీచార్జ్ తో 30GB డేటా, 15 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్.. ఇదికదా బంపరాఫర్ అంటే

తక్కువ ధరకే ఎక్కువ డేటా, నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి రిలయన్స్ జియో అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. రూ.200 రీఛార్జ్‌తో నెలంతా ఎంజాయ్ చేసే ఆఫర్ ఇది. ఇక్కడ ఈ ఆఫర్ ఫుల్ డిటెయిల్స్ తెలుసుకొండి.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 26 2026, 12:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జియో రూ.200 ప్లాన్ బెనిఫిట్స్
Image Credit : Gemini AI

జియో రూ.200 ప్లాన్ బెనిఫిట్స్

తక్కువ ధరలో ఎక్కువ డేటా, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తున్నారా? అయితే రిలయన్స్ జియో అందిస్తున్న రూ.200 ప్లాన్ బెస్ట్ ఆప్షన్. ఈ రీచార్జ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో మొత్తం 30GB హై-స్పీడ్ డేటా వాడుకోవచ్చు. 30GB డేటా అయిపోయాక ఇంటర్నెట్ స్పీడ్ 64Kbpsకి పడిపోతుంది.

అయితే ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే… అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఫ్రీ ఎస్ఎంఎస్ సదుపాయం లేదు. కేవలం డేటా, ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికే ఈ రీచార్జ్ ప్లాన్ సూట్ అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఫ్రీగా 15 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్
Image Credit : Getty

ఫ్రీగా 15 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్

ఈ డేటా రీచార్జ్ ప్లాన్‌లో ఓటీటీ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి… ఇదే ఇందులో హైలైట్. యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో మొబైల్, జియోహాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్స్ట్, కంచా లంకా, ఈటీవీ విన్, చౌపల్, హోయ్‌చోయ్, ఫ్యాన్‌కోడ్, టైమ్స్ ప్లే, తారంగ్ ప్లస్‌ వంటి 15 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ యాక్సెస్ లభిస్తుంది. అంతేకాదు జియో టీవీ ద్వారా 1000కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ ఫ్రీగా చూడొచ్చు. అయితే ఈ ఆఫర్‌లో స్పోర్ట్స్ ఛానెల్స్ లేవు… కేవలం ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్ ఛానల్స్ చూడవచ్చు.

34
సినిమా టికెట్లపై డిస్కౌంట్
Image Credit : Asianet News

సినిమా టికెట్లపై డిస్కౌంట్

రూ.200 ప్లాన్ రీచార్జ్ బెనిఫిట్స్ ఇక్కడితో ఆగలేదు. ఈ ప్లాన్‌తో సినిమా టికెట్లపైనా తగ్గింపు పొందవచ్చు.. దేశవ్యాప్తంగా సినీపొలిస్ మల్టీప్లెక్స్ లో సినిమా టికెట్లపై గరిష్ఠంగా రూ.150 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ కోసం కనీసం రూ.550 విలువైన రెండు టికెట్లు బుక్ చేయాలి. థియేటర్ లో ఫుడ్, కూల్ డ్రింక్స్‌పై కూడా 10 శాతం తగ్గింపు ఉంటుంది. అయితే మంగళవారం రోజు ఈ ఆఫర్ వర్తించదు.

44
అన్ లిమిటెడ్ 5జీ సదుపాయం కూడా..
Image Credit : stockPhoto

అన్ లిమిటెడ్ 5జీ సదుపాయం కూడా..

ఈ రూ.200 రీచార్జ్ ప్లాన్‌లో ట్రూ 5జీ సదుపాయం కూడా ఉంది. కానీ అన్‌లిమిటెడ్ 5జీ డేటా పొందాలంటే కొన్ని షరతులున్నాయి. యూజర్ వద్ద రోజుకు 1GB లేదా 1.5GB డేటా ఇచ్చే బేస్ ప్లాన్ యాక్టివ్‌గా ఉండాలి. దాంతో పాటు 5జీ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్, జియో ట్రూ 5జీ సర్వీస్ అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఉండటం తప్పనిసరి. ఈ నిబంధనలన్నీ పాటిస్తేనే అన్‌లిమిటెడ్ 5జీ డేటా వాడుకోగలరు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతీయ టెలికాం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ.12 వేలకే 5G ఫోన్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. ఫ్లిప్‌కార్ట్ ధమాకా డీల్
Recommended image2
Kitchen Gadgets: ఇంకా.. ఇవే పాత కాలం ప‌ట్క‌ర్ల‌ను వాడుతున్నారా.? అప్డేట్ అవ్వండి బ్రో
Recommended image3
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీలు సగం ధరకే.. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు
Related Stories
Recommended image1
Jio Freedom Plan: ఎయిర్‌టెల్‌ను దెబ్బకొడుతూ జియో కొత్త ఫ్రీడమ్ ప్లాన్..అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, ఫ్రీ OTT కూడా
Recommended image2
Jio Home : జియో సూపర్ ప్యాకేజీ.. నెలకు రూ.400 తో టీవి ఛానల్స్, ఓటిటి యాప్స్, హైస్పీడ్ వైఫై పొందండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved